temple decorated with currency notes and gold.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని ఓ ఆలయాన్ని రూ.8 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్వాహక కమిటీ గోడలు, నేలపై రూ.3.5 కోట్ల కరెన్సీ నోట్లు, ఆభరణాలతో అలంకరించారు. 1 రూపాయి నుండి 2,000 రూపాయల వరకు వివిధ రకాల నోట్ల కట్టలు దేవత చుట్టూ, నేలపై, గోడలకు అతికించారు. అంతేకాకుండా ఆలయ పైకప్పుకు కూడా వేలాడదీశారు. 135 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయ కమిటీ ప్రకారం.. కరెన్సీ నోట్లు, బంగారు ఆభరణాలు భక్తుల నుండి వచ్చినవని, వాటిని ఉత్సవాల తర్వాత వారికి తిరిగి ఇవ్వబడతాయని తెలిపారు. అయితే.. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లోని ఒక దేవాలయాన్ని ఈ విధంగా అలంకరించడం ఇదే మొదటిసారి కాదు.
గతేడాది నెల్లూరు జిల్లాలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని రూ.5.16 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. రూ.2000, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.10 వంటి వివిధ రకాల కరెన్సీ నోట్లతో తయారు చేసిన ఓరిగామి పూల మాలలు, పుష్పగుచ్ఛాలతో నిర్వాహకులు అమ్మవారిని అలంకరించారు. గతంలో తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలోని కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని రూ.1,11,11,111 కరెన్సీ నోట్లతో అలంకరించారు. 2017లో ఆలయ కమిటీ ఇదే తరహాలో రూ.3,33,33,333 కరెన్సీ నోట్లతో నైవేద్యాన్ని సమర్పించింది. అయితే.. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.