జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ ఆడి, విజిల్ వేసి మహిళలతో కలిసి స్టెప్పులేశారు రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ స్వరాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఆడబిడ్డలకు ఎంతో ఇష్టమైన పండుగ ఈ బతుకమ్మ పండుగ అని, సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగకు ప్రభుత్వం తరుఫున ఎక్కడా తగ్గకుండా ఏర్పాట్లు చేయించారన్నారు.
అయితే.. కొత్త పార్టీ ఏర్పాటు తరువాత ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు మారుతాయన్నారు. జాతీయ స్థాయిలో విస్తరణతో ఏదో సాధించకపోయినా ఇతర పార్టీల్లో అసంతృప్తిలో ఉన్న చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు మాతో కలసి వస్తారన్నారు. నూతన పార్టీ లోకి అనేక చేరికలు ఉంటాయని ఆయన వెల్లడించారు. మేము ఆశించిన స్థాయిలో కాకపోయినా రాష్ట్రానికి ఒక ఎంపీ, ఎమ్మెల్యే గెలిచి వచ్చిన మా టార్గెట్ రిచ్ అయినట్లేనన్నారు.