తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5కి తెరపడింది. గత ఆదివారం విన్నర్ ని ప్రకటించారు. సన్ని విజేతగా, షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచారు. మూడో స్థానాన్ని మాజీ ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర పొందారు. ఇదిలా ఉంటే ఈ బిగ్ బాస్ సీజన్ 5 అంతా డల్ గా గడిచింది. గత సీజన్స్ తో పోలిస్తే రేటింగ్ లోనూ బాగా వెనుకబడింది. దానికి కారణం అంత ఆసక్తిగా లేకపోవడంతో పాటు పాల్గొన్న వారికి అంతంత ఇమేజ్ […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులోనూ సుపరిచితుడే . అయన నటించిన తమిళ్ సినిమాలు తెలుగులో డబ్ అవుతాయి. ఇప్పటివరకు టాలీవుడ్ లో స్ట్రైట్ ఫిల్మ్ లో నటించని ధనుష్ తాజాగా తన స్ట్రైట్ ఫిల్మ్ ప్రకటించేశాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో చిత్రంతో తన డైరెక్ట్ తెలుగు సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాకు ‘తొలిప్రేమ’ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా.. సూర్యదేవర నవ వంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు. […]
పరభాషా నాయికల కోసం టాలీవుడ్ డోర్స్ ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. ఈ మధ్యలో కన్నడ భామలు అత్యధికంగా తెలుగు చిత్రసీమలోకి వచ్చారు. అయితే ఆ జోరు ఇప్పుడు కాస్తంత తగ్గింది. కానీ చిత్రంగా ఈ యేడాది శాండిల్ వుడ్ బ్యూటీ కృతీశెట్టి అత్యధిక అవకాశాలు అందుకుని, నయా హీరోయిన్స్ జాబితాలో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఓవర్ ఆల్ గా చూసినప్పుడు ఈ యేడాది పరభాష భామల ఎంట్రీ కూడా బాగానే వుంది. ‘ఉప్పెన’తో […]
ముంబైలో ‘ఆర్ఆర్ఆర్’ త్రయం హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 7 న ‘ట్రిపుల్ ఆర్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఇటీవల ముంబైలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించిన రాజమౌళి.. బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ లు ఇస్తూ బిజీగా మారిపోయారు. రామ్ చరణ్, తారక్, రాజమౌళి ముంబైలో ఇంటర్వ్యూలో పాల్గొన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ ‘ఆర్ఆర్ఆర్’ త్రయంలో మరో ఆర్ కలిసింది. అదేనండీ ఈ ట్రిపుల్ ఆర్ […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కొనసాగుతున్న ‘అన్ స్టాపబుల్’ సీజన్ ముగిసిపోతోంది. ఏంటి అప్పుడేనా..? మొన్ననే కదా స్టార్ట్ అయ్యింది.. అంటే అవును మొన్ననే స్టార్ట్ అయిన ఈ టాక్ షో 8 ఎపిసోడ్లతోనే సీజన్ పూర్తి చేసుకోనుంది. ఈ విషయాన్నీ ఆహా మేకర్స్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలియజేశారు. బాలయ్య టాక్ షో అనగానే వామ్మో అని భయపడిన అభిమానులు మొదటి ఎపిసోడ్ చూశాక బాలయ్యలోని కొత్త కోణాన్ని చూశారు . వరుసగా మోహన్ బాబు, […]
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ‘భీమ్లా నాయక్’ వాయిదా పాడడం హాట్ టాపిక్ గా మారింది. రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య ఒక రీమేక్ ని విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారు అంటూ పవన్ అభిమానులు నెట్టింట రచ్చ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ని టాలీవుడ్ అవసరానికి వాడుకొంటుంది. ఆయనకు చిత్ర పరిశ్రమలో ఏ ఒక్కరు సపోర్ట్ చేయలేదు.. ఇప్పుడు ఆయనే అవసరమయ్యారు. అవసరం కోసం పవన్ దగ్గరకు వచ్చారా..? ‘భీమ్లా నాయక్’ వారు అడగడంతోనే వాయిదా వేశారని […]
బాలీవుడ్ లో పనామా పేపర్ లీక్స్ కేసు హడలు పుట్టిస్తోంది. విదేశాల్లో అక్రమంగా పెట్టుబడులు పెడుతున్నారని ఈడీ విచారణలో తెలియడంతో బాలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారిస్తుంది. ఇప్పటికే సోమవారం బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ ఈడీ విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2016లో పనామా నుంచి నడిచే ఓ లా కంపెనీకి చెందిన రూ.11.5 కోట్లకు సంబంధించిన ట్యాక్స్ డాక్యుమెంట్ లీకు అయ్యాయి. వాటి గురుంచి మూడు గంటలు పలు రకాల ప్రశ్నలను ఐష్ ని అడిగారు అధికారులు. […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ సైతం అంతే లెవల్లో ప్లాన్ చేసారట మేకర్స్. డిసెంబర్ 23న రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభంగా జరగనుంది. ఇక అందుతున్న సమాచారం […]