ముంబైలో ‘ఆర్ఆర్ఆర్’ త్రయం హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 7 న ‘ట్రిపుల్ ఆర్’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.ఇటీవల ముంబైలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించిన రాజమౌళి.. బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ లు ఇస్తూ బిజీగా మారిపోయారు. రామ్ చరణ్, తారక్, రాజమౌళి ముంబైలో ఇంటర్వ్యూలో పాల్గొన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది సంగతి తెలిసిందే.
ఇక తాజాగా ఈ ‘ఆర్ఆర్ఆర్’ త్రయంలో మరో ఆర్ కలిసింది. అదేనండీ ఈ ట్రిపుల్ ఆర్ లతో బాహుబలి భల్లాలదేవ రానా కలిసిపోయాడు. ముంబైలో వీరి ముగ్గుర్ని రానా ఇంటర్వ్యూ చేయనున్నాడు.. ఈ క్రేజీ ఇంటర్వ్యూని త్వరలోనే రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఇక ఈ ఇంటర్వ్యూ సమయంలో నలుగురు కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేసిన రానా” ముంబైలో ఈ ముగ్గురు ఆర్ లతో నా ఉదయం మొదలయ్యింది.. ట్రిపుల్ ఆర్ తో ఆర్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ నలుగురు ఇంటర్వ్యూలో ఎలాంటి రచ్చ చేశారో చూడాలి.
A fun and crazy Interview Loading!! 🤩💥 #RwithRRR 💥 #RRRMovie #RRRonJan7th pic.twitter.com/CI52eW2pWO
— RRR Movie (@RRRMovie) December 22, 2021