సినిమా .. ఓ రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎవరిని నమ్మకూడదు. అలా నమ్మితే మోసపోవడం ఖాయం. ఎంతోమంది మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తారు. తాజగా ఒక నిర్మాత కూడా ఒక నటిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తన శారీరక కోరికలు తీర్చుకొని పెళ్లి అనేసరికి ముఖం చాటేసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇక అతడి బెదిరింపులు తట్టుకోలేని ఆమె పోలీసులను ఆశ్రయించడంతో నిర్మాత గుట్టు బయటపడింది. ప్రస్తుతం ఈ ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం […]
రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కానీ తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి విద్యాసంస్థల నిర్వహణకు ప్రభుత్వం అనుమతిచ్చేసింది. కొన్ని రాష్ట్రాలలోనూ రాత్రి కర్ఫ్యూను, వీకెండ్ లాక్ డౌన్ ను ఎత్తివేశారు. సో… సినిమా నిర్మాతలూ కాస్తంత ఊపిరి పీల్చుకుని ఆశావాహ దృక్పథంతో థియేటర్లలో తమ చిత్రాలను విడుదల చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. అలా దాదాపు రెండేళ్ళ క్రితం మొదలై, విడుదల కాకుండా ఆగిపోయిన శ్రీకాంత్ ‘కోతల రాయుడు’ సినిమా సైతం ఫిబ్రవరి 4న జనం […]
వయసుతో పనియేముంది? మనసులోనే అంతా ఉందని అంటూ ఉంటారు రసికులు. నాజూకు సోకుల నల్లకలువ హ్యాలీ బెర్రీ సైతం అదే పాట అందుకుంది. ప్రముఖ పాటగాడు వ్యాన్ హంట్ తో ఆమె ప్రేమాయణం సాగిస్తూ ఉందని జనానికి తెలుసు. కానీ, ఇప్పటికే మూడు వివాహాలు చేసుకుని, వాటిని విడదీసుకున్న హ్యాలీ తన 55 ఏళ్ళ వయసులో వ్యాన్ హంట్ పై మనసు పారేసుకోవడం విశేషమనే చెప్పాలి. జనవరి 1వ తేదీన వీరిద్దరూ జరుపుకున్న ఓ పార్టీకి సంబంధించిన […]
కొణిదెల అంజనా దేవి.. ఈ పేరు ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. చిత్ర పరిశ్రమకు ముగ్గురు రత్నాల్లాంటి బిడ్డలను అందించింది. చరిత్ర గుర్తుంచుకొనే హీరోలను తయారుచేసింది. మెగాస్టార్ మాతృమూర్తిగా నిత్యం అందరి హృదయాల్లో కొలువున్న అమ్మ అంజనా దేవి. నేడు ఆమె పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. అమ్మకు అపురూపంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగా బ్రదర్స్. “అమ్మా! జన్మదిన శుభాకాంక్షలు. క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా.. నీ […]
బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ తన బాయ్ ఫ్రెండ్ రోహ్మన్ షాతో విడిపోయిన సంగతి తెలిసిందే. గతేడాది సుస్మితా ‘ఫ్రెండ్స్‌గా మొదలైన మా ప్రయాణంలో ఫ్రెండ్స్‌గానే మిగిలిపోతున్నాము. చాలాకాలం క్రితమే రిలేషన్‌షిప్ ముగిసింది’ అంటూ అధికారికంగా బ్రేకప్ ప్రకటించింది. అప్పటి నుంచి సింగిల్ లైఫ్ ని మళ్లీ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట మరోసారి కలిసి వార్తల్లో నిలిచారు. బ్రేకప్ చెప్పుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరూ కలుసుకోవడమే కాకుండా ఒకే కారులో ప్రయాణిస్తూ కెమెరా కంట కూడా […]
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడీ. ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11 న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టేశారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ […]
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో పూజ హెగ్డే ఒకరు. కరోనా సమయంలో కూడా అమ్మడి షెడ్యూల్ బిజీగా ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. గతేడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో విజయ ఢంకా మొదలుపెట్టిన బుట్టబొమ్మ ఆచార్య, రాధేశ్యామ్ తో విజయాన్ని కంటిన్యూ చేస్తుందని అనుకున్నారు. కానీ, కరోనా తో ఆ రెండు సినిమాలు వాయిదా పడడంతో అమ్మడికి బ్రేక్ పడింది. ఇక ఇటు పక్క కోలీవుడ్, బాలీవుడ్ లోను […]
అమ్మాయి అంటే..ఇలాంటి కొలతలు ఉండాలి.. అలాంటి కలర్ ఉండాలి.. ముట్టుకుంటే మాసిపోవాలి.. పట్టుకుంటే కందిపోవాలి అని ఎంతోమంది హేళన చేస్తుంటారు. ఇక హీరోయిన్లు చాలామంది ఈ బాడీ షేమింగ్ ని ఎదుర్కొన్నవారే. అందంగా లేరని, ముక్కు వంకర, మూతి వంకర.. పొట్టిగా ఉంది, నల్లగా ఉంది అంటూ ఎవరో ఒకరు బాడీ షేమింగ్ చేస్తూనే ఉంటారు. కానీ ఆ మాటలు ఎంత బాధ కలిగిస్తాయో పడినవారికే తెలుస్తోంది అంటున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. తాను కూడా బాడీ […]