బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ తన బాయ్ ఫ్రెండ్ రోహ్మన్ షాతో విడిపోయిన సంగతి తెలిసిందే. గతేడాది సుస్మితా ‘ఫ్రెండ్స్‌గా మొదలైన మా ప్రయాణంలో ఫ్రెండ్స్‌గానే మిగిలిపోతున్నాము. చాలాకాలం క్రితమే రిలేషన్‌షిప్ ముగిసింది’ అంటూ అధికారికంగా బ్రేకప్ ప్రకటించింది. అప్పటి నుంచి సింగిల్ లైఫ్ ని మళ్లీ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట మరోసారి కలిసి వార్తల్లో నిలిచారు. బ్రేకప్ చెప్పుకున్న తర్వాత తొలిసారిగా వీరిద్దరూ కలుసుకోవడమే కాకుండా ఒకే కారులో ప్రయాణిస్తూ కెమెరా కంట కూడా పడ్డారట.
ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. అయితే వీరిద్దరూ కలుసుకోవడానికి కారణం.. ఈ ఇద్దరికీ పరిచయమున్న ఒక ఫ్రెండ్‌ను కలవడానికని తెలుస్తోంది. సుస్మితను ఇంటి నుంచి రోహ్మన్ షానే తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారని, కామన్ ఫ్రెండ్ తో కొద్దిసేపు ముచ్చటించి ఇద్దరు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ మళ్లీ కలుస్తారు అనే వార్తలు గుప్పుమంటున్నాయి.