అమ్మాయి అంటే..ఇలాంటి కొలతలు ఉండాలి.. అలాంటి కలర్ ఉండాలి.. ముట్టుకుంటే మాసిపోవాలి.. పట్టుకుంటే కందిపోవాలి అని ఎంతోమంది హేళన చేస్తుంటారు. ఇక హీరోయిన్లు చాలామంది ఈ బాడీ షేమింగ్ ని ఎదుర్కొన్నవారే. అందంగా లేరని, ముక్కు వంకర, మూతి వంకర.. పొట్టిగా ఉంది, నల్లగా ఉంది అంటూ ఎవరో ఒకరు బాడీ షేమింగ్ చేస్తూనే ఉంటారు. కానీ ఆ మాటలు ఎంత బాధ కలిగిస్తాయో పడినవారికే తెలుస్తోంది అంటున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. తాను కూడా బాడీ షేమింగ్ ని ఎదుర్కొన్నానని తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు. శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి బాడీ షేమింగ్ కి గురైన సంగతి తెల్సిందే. నటన, డాన్స్ బావున్నాయని ప్రశంసిస్తూనే ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ విమర్శించారు. వాటిపై తమిళిసై తనదైన రీతిలో స్పందించారు.
ఇటీవల ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ” నేను కూడా బాడీ షేమింగ్ ఎదుర్కొన్నాను.. నల్లగా ఉన్నానని, పొట్టిగా ఉన్నానని చాలామంది నన్ను ఏడిపించేవారు. ఆ మాటల వలన నేను చాలా బాధపడ్డాను. కానీ వాటన్నింటిని తట్టుకొని నిలబడ్డాను. నా ప్రతిభతో ముందుకు నడిచాను. ఆ కామెంట్స్ పట్టించుకోకుండా ఉండడానికి, బాధపడకుండా ఉండడానికి మనమేమి మహాత్ములం కాము..నల్లగా, పొట్టిగా పుట్టడం నా తప్పు కాదు. చూసేవారి చూపును బట్టి అందం ఉంటుంది. తెలుగులో ఒక సామెత ఉంటుంది. కోడిపిల్ల కోడికి ముందు అని.. ఆ కోడిపిల్ల ఎలా ఉన్నా తల్లికి బంగారంలానే కనిపిస్తుంది. బిడ్డ ఏ రంగులో ఉన్నా తల్లి తిరస్కరించదు. నిజం చెప్పాలంటే స్త్రీలే ఎక్కువగా బాడీ షేమింగ్ కి గురవుతున్నారు.. 50 ఏళ్ల పురుషులు మాత్రం ఇప్పటికి యువకుల్లానే పరిగణించబడుతున్నారు. ఇది మారాలి అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమిళిసై వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి