కొణిదెల అంజనా దేవి.. ఈ పేరు ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. చిత్ర పరిశ్రమకు ముగ్గురు రత్నాల్లాంటి బిడ్డలను అందించింది. చరిత్ర గుర్తుంచుకొనే హీరోలను తయారుచేసింది. మెగాస్టార్ మాతృమూర్తిగా నిత్యం అందరి హృదయాల్లో కొలువున్న అమ్మ అంజనా దేవి. నేడు ఆమె పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. అమ్మకు అపురూపంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగా బ్రదర్స్. “అమ్మా! జన్మదిన శుభాకాంక్షలు. క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా.. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ అభినందనలతో .. శంకరబాబు “అని తన తల్లి అంజనాదేవితో కలిసి దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి.
ఇక నాగాబు సైతం తన తల్లి ప్రేమను తెలుపుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు హీరోలు, తన తల్లితో కలిసి దిగిన పాత ఫోటో ఒకటి ప్రస్తుతం యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. అంజనా దేవి చుట్టూ చేరి చిరు, నాగబాబు, పవన్ కళ్యాణ్ నవ్వులు చిదిస్తున్న ఈ అపురూపమైన ఫోటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫొటోలో పవన్ మాలలో కనిపించడం విశేషం. యంగ్ లుక్ లో చిరు, నాగబాబు, పవన్ చాలా అందంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. త్రిమూర్తులతో తల్లి అంజనా దేవి.. ఆనంద క్షణాలు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.