IMD Monsoon Forecast: రైతన్నలకు చేదు వార్త.. ఆగస్టు, సెప్టెంబర్లలో తగ్గనున్న వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IMD Monsoon Forecast: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రుతుపవనాల రెండో విడత (ఆగస్టు-సెప్టెంబర్ 2026) అంచనాలను విడుదల చేసింది. రైతన్నలకు ఇది ఓ చేదు వార్త కానుంది. ఎందుకంటే రాబోయే రెండు నెలల్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఆగస్టు నెలలో దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత తగ్గి, పగటితో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్‌నినో’ పరిస్థితులు మరింత బలపడటమే ఇందుకు ప్రధాన కారణమని ఐఎండీ స్పష్టం చేసింది.
ఈ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపైనా గణనీయంగా పడనుంది. ఆగస్టు-సెప్టెంబర్ కాలంలో తెలంగాణలో సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే, ఉత్తర, పశ్చిమ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఒక్క ఆగస్టు నెల వరకు చూస్తే ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉండగా, పశ్చిమ, దక్షిణ తెలంగాణలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. వర్షాలు తగ్గడంతో పాటు ఆగస్టు నెల అంతటా తెలంగాణవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. పగటి వేడితో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండి, రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉక్కపోత, వేడి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!