Jr NTR : ‘డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. ఎన్టీఆర్ గాయం కారణంగా శ్రీలంక షెడ్యూల్ రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే వైద్యులు ఎన్టీఆర్ కు తగిన చికిత్స అందించి సుమారు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోమని స్పష్టం చేశారు. పూర్తిగా కోలుకునే వరకు ఎలాంటి షూటింగ్స్‌లోనూ పాల్గొనవద్దని వైద్యులు సూచించారు.
ఈ పరిణామంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందగా హెల్త్ అప్డేట్పై ఎన్టీఆర్ టీమ్ భరోసా ఇచ్చింది. అభిమానులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, తారక్ త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని స్పష్టం చేసింది. అయితే తారక్ గాయం కారణంగా ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ముఖ్యంగా మేకర్స్ ప్లాన్ చేసిన భారీ శ్రీలంక షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ పూర్తిగా క్యాన్సల్ చేయాల్సి వచ్చిందని సమాచారం. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాతే షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ తిరిగి పట్టాలెక్కే అవకాశముంది. షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడినప్పటికీ సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని తెలుస్తోంది. గతంలో ప్రకటించినట్లే జూన్ 2027లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు