HYDRAA : హైడ్రాపై హైకోర్టు ఫైర్.. కమిషనర్ బదిలీకి ఆదేశాలు.!
- రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
- కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై ఘాటు వ్యాఖ్యలు
- సీఎస్‌కు కమిషనర్ బదిలీ ఆదేశం
- 'చట్టం పాలన ఉండాలి.. వ్యక్తులది కాదు'
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRAA: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతాశ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, కమిషనర్ కోర్టు ఉత్తర్వులను స్పష్టంగా ఉల్లంఘించారని తేల్చిచెప్పింది. ఈ మేరకు రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేసి, ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ని హైకోర్టు ఆదేశిస్తూ జడ్జిమెంట్ కాపీలో సంచలన అంశాలను వెల్లడించింది.
చట్ట ఉల్లంఘన సహించేది లేదు.. కోర్టు సంచలన వ్యాఖ్యలు
వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, మనుషులతో ప్రవేశించడం ముమ్మాటికీ చట్టవిరుద్ధమని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ సందర్బంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చించిన ‘టాటా మోహన్ రావు’ కేసు ఉత్తర్వులను హైకోర్టు ప్రస్తావించింది. “శిక్షించడంలో కాకుండా క్షమించడంలోనే చట్టం ఔన్నత్యం ఉంది” అని పేర్కొంటూనే, పాలనలో చట్టం పరిధి దాటి వెళ్లకూడదని హెచ్చరించింది.
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
“రాష్ట్రంలో ఎప్పుడైనా చట్టం పాలన మాత్రమే కొనసాగాలి తప్ప వ్యక్తుల పాలన కాదు. ఒకవేళ అధికారుల లేదా వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే అది ప్రజాస్వామ్యానికి మరణశాసనం అవుతుంది. ఈ కేసే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ” అని న్యాయస్థానం తన తీర్పులో అత్యంత ఘాటుగా అభిప్రాయపడింది. చట్ట నియమాలను పక్కనబెట్టి వ్యవహరించే వైఖరి ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమని స్పష్టం చేస్తూ, రంగనాథ్ స్థానంలో వేరే అధికారిని బాధ్యతల్లోకి తీసుకోవాలని సీఎస్‌ను కోరింది.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!