Top Natural Ways to Cleanse & Strengthen Your Liver: కాలేయం మన శరీరంలో అత్యంత శ్రమించే అవయవం. ఆహారం జీర్ణం కావడం నుంచి శరీరంలోకి వచ్చే విషపదార్థాలను ఫిల్టర్ చేయడం వరకు ఎన్నో పనులను ఇది నిరంతరం చేస్తూనే ఉంటుంది. కానీ మన జీవిత శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ప్రాసెస్‌డ్ ఆహారం, మద్యం వంటి కారణాలతో ఈ అవయవం పనితీరు నెమ్మదిగా దెబ్బతింటుంది. కాలేయం బలహీనపడితే శరీరం మొత్తం ప్రభావితం అవుతుంది కాబట్టి, దాన్ని సమయానుకూలంగా శుభ్రపరచుకోవడం, దానికి విశ్రాంతి ఇవ్వడం అత్యంత అవసరం.
READ MORE: Krishna Dammalapati: హీరోగా ఎంట్రీ ఇస్తున్న మరో నిర్మాత కొడుకు..
కాలేయాన్ని బలంగా, శుభ్రంగా ఉంచుకోవడానికి కేవలం ఔషధాలపై ఆధారపడటం సరికాదు! శరీరానికి సహజంగా ఉపయోగపడే ఆహారాలు, పానీయాలు, రోజువారీ అలవాట్లు సైతం లివర్ ఆరోగ్యానికి ముఖ్య పాత్ర వహిస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగడం, ఆకుకూరలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం లివర్‌పై ఒత్తిడి తగ్గించడం ముఖ్యం. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయే విషాలు బయటకు వెళతాయి. చిలగడదుంప, పాలకూర, బీన్స్, బీట్‌రూట్ ఆకులు, అరటిపండ్లు వంటి పొటాషియం సమృద్ధిగా ఉండే ఆహారాలు లివర్ శుభ్రతను మెరుగుపరుస్తాయి. వెల్లుల్లిలో ఉండే సహజ పదార్థాలు లివర్ ఎంజైమ్ కార్యకలాపాలను మేలుచేస్తాయి. రాత్రి పూట పచ్చివెల్లుల్లి తినడం వల్ల శరీరంలో పేరుకున్న టాక్సిన్స్ క్రమంగా బయటకు పోతాయి. అదే విధంగా పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లివర్ కణాలను రక్షించి, దెబ్బతిన్న భాగాలను పునరుద్ధరించడంలో సహాయపడతాయి. వేడి పాలను లేదా తేనెతో కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా పనిచేస్తుంది.
READ MORE: Krishna Dammalapati: హీరోగా ఎంట్రీ ఇస్తున్న మరో నిర్మాత కొడుకు..
జంక్ ఫుడ్, అధిక కొవ్వు ఉన్న ఆహారాలు, వేపుడు పదార్థాలను తగ్గించడం వల్ల లివర్‌కు నిజమైన ఉపశమనం ఇస్తుంది. ఇవి తగ్గించిన కొద్దికాలంలోనే కాలేయంలోని కొవ్వు పేరుకుపోవడం గణనీయంగా తగ్గుతుంది. నిరంతరంగా హానికరమైన ఆహారం తీసుకుంటే లివర్‌లో కొవ్వు ఫిల్టరింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది. అలాంటి సమయంలో శరీరంలోని అగ్గి శక్తి (జీర్ణశక్తి) బలహీనపడుతుంది. అందుకే తేలికపాటి, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. డీటాక్స్ కోసం కొన్ని సహజ పానీయాలు కూడా ఉపయోగపడతాయి. అల్లం, నిమ్మరసం, గోరువెచ్చని నీటితో తయారయ్యే పానీయం లివర్‌పై పేరుకుపోయిన మలినాలను క్రమంగా బయటకు తీసేయగలదు. ఇదే విధంగా క్రాన్‌బెర్రీ, నారింజ, నిమ్మరసం కలిపిన పానీయం రోజంతా త్రాగడం వల్ల కాలేయానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. అయితే వీటిని కూడా పరిమిత పరిమాణాల్లోనే తీసుకోవడం ఉత్తమం.
Note:
నోట్ : ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాం.. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు.కామ్ బాధ్యత వహించదు.