Musi River Floods MGBS: నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది. భారీ వర్షాల కారణంగా మూసీ నదిలో నీటి ప్రవాహం పెరిగిపోవడంతో, ముసరాంబాగ్ వంతెన మూసివేశారు. దీంతో రాకపోకలు నిలిపివేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో మూసీ నదికి వరద ఉద్ధృతి రావడంతో కొత్తగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు నిలిచిపోయాయి.…
YS Jagan: సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించటంపై మాజీ సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన సుమోటో ఆదేశాలను తాను స్వాగతిస్తున్నానంటూ జగన్ ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే హ్యాష్ ట్యాగ్ తో ఎక్స్ లో పోస్టు చేశారు. హైకోర్టు నిర్ణయం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితికి నిదర్శనని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు.
Acidity: చాలా మంది ప్రజలు అనుభవించే జీర్ణ రుగ్మతలలో ఎసిడిటీ , గ్యాస్ట్రిక్ సమస్యలు ఒకటి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి , జీవనశైలి ఎంపికల వల్ల ఇది సంభవించవచ్చు. మీరు ఇంటి నివారణల ద్వారా అసిడిటీ సమస్యను వదిలించుకోవచ్చు. అందులో అతి ముఖ్యమైన హోం రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Indonesia: ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం-మెజారిటీ దేశం, 270 మిలియన్లకు పైగా ప్రజలు ఉన్నారు. ప్రస్తుతం ఆ దేశంలోని మధుర ద్వీపంలో తొమ్మిది నెలలుగా మీజిల్స్(తట్టు వ్యాధి) వ్యాప్తి కొనసాగుతోంది. ఈ సంవత్సరం, 2,600 కంటే ఎక్కువ మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారు. అందులో 20 మంది మరణించారు. మహమ్మారిని అరికట్టడంలో సహాయపడటానికి ఆరోగ్య కార్యకర్తలు సుమెనెఫ్ జిల్లాకు వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్నారు.
ICC Fines SuryaKumar Yadav: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారత T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా విధించింది. అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2025 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ విజయాన్ని పహల్గామ్ దాడి బాధితులకు, భారత సైన్యానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ ప్రకటన రాజకీయ ప్రేరేపితమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
Farmer Suicide: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా బార్షి తాలూకాలోని దహితానే (వైరాగ్) గ్రామంలో ఒక విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, అధిక వర్షపాతం, పెరుగుతున్న విద్యా ఖర్చులతో బాధపడుతూ ఒక రైతు మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు 40 ఏళ్ల లక్ష్మణ్ కాశీనాథ్ గవాసానేగా గుర్తించారు.
Maharashtra: మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్గావ్లో జరిగిన "ఐ లవ్ మొహమ్మద్" కార్యక్రమంలో ఒక మతాధికారి చేసిన ప్రకటన పెద్ద వివాదానికి దారితీసింది. బహిరంగ వేదిక నుంచి మతాధికారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బహిరంగంగా సవాలు చేశారు. మజల్గావ్కు వస్తే.. సీఎం యోగిని అక్కడే ఖననం చేస్తానని హెచ్చరించాడు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
US Pakistan Relations: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌లను వైట్ హౌస్‌లో కలిశారు. ఓవల్ కార్యాలయంలో షాబాజ్, మునీర్‌లను కలవడానికి ముందు.. ట్రంప్ వారిద్దరినీ ప్రశంసించారు. మునీర్‌ను కొంచెం ఎక్కువగానే మెచ్చుకున్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌తో ట్రంప్ సమావేశం కావడం ఇది రెండవ సారి. ట్రంప్ గతంలో జూన్ 18, 2025న మునీర్‌ను కలిశారు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. కాగా.. పాకిస్థాన్‌పై ట్రంప్ యు-టర్న్ తీసుకోవడంపై…
WHO: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ఓ ప్రకటన వివాదానికి దారితీసింది. గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో టైలెనాల్ (పారాసెటమాల్) తీసుకోకూడదని ఆయన అన్నారు. ఈ ఔషధం పిల్లలలో ఆటిజం ప్రమాదాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న ఆటిజం కేసులకు ఈ ఔషధం కారణమని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటన తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా గందరగోళలం నెలకొంది. వైద్యులు పారాసెటమాల్ సురక్షితమైందని.. ఆటిజంతో దీనికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. తాజాగా ట్రంప్ ప్రకటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది.
Maruti Suzuki Sales: ప్రస్తుతం పండుగల సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే మార్కెట్ సందడిగా ఉంది. సెప్టెంబర్ 22న అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ మరింత ఉత్సాహాన్ని జోడించింది. వాహనాల ధరలు గణనీయంగా తగ్గాయి. దీని ప్రత్యక్ష ప్రభావం కార్ల కొనుగోళ్లపై కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. మారుతి సుజుకి కార్ల అమ్మకాలలో ముందంజలో ఉంది.