AP Weather Alert: ఏపీలో డబుల్ అలర్ట్.. రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు.. ఆ జిల్లాల్లో ఎండలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Weather Alert: రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయని, రేపు, ఎల్లుండి కూడా ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ–రాయలసీమ–తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి ప్రభావం విస్తరించిందని తెలిపింది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. ఆదివారం, సోమవారం మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు, పిడుగులు పడేటప్పుడు రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడవద్దు. నేడు గరిష్ఠంగా కడప జిల్లా ఒంటిమిట్టలో 45°C నమోదైంది. 244 మండలాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. కర్నూలు గూడూరు, నంద్యాల ఆళ్లగడ్డలో 44.3°C, అనంతపురం తెరన్నపల్లిలో 44.1°C, తిరుపతి వరదయ్యపాలెం 43.5°C, మార్కాపురం కొమరోలు 43°C, కాకినాడ కరప, శ్రీసత్యసాయి కొత్తచెరువు 42.9°C, ప్రకాశం కొప్పెరపాడు 42.5°C, పల్నాడు గురజాల 42.3°C, అన్నమయ్య నూలివీడు 41.9°C నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో 7 మండలాలు తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉండనుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 14 మండలాలతోపాటు విజయనగరం 7, మన్యం 1, అల్లూరి 2, పోలవరం 7, కాకినాడ 3, తూర్పుగోదావరి 4, ఏలూరు వేలేరుపాడు మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండనుంది.
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!