Ratan Tata Death Anniversary: ఈరోజు ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా వర్ధంతి. ఆయన అక్టోబర్ 9, 2024న 86 సంవత్సరాల వయసులో వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా మరణించారు. ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ఆయన తుది శ్వాస విడిచారు. రతన్ టాటా జీవితం చాలా మందికి స్ఫూర్తిదాయకం. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరిగా ఉన్నప్పటికీ, ఆడంబరానికి దూరంగా సరళమైన జీవితాన్ని గడిపారు. వివిధ వ్యాపారాల నుంచి […]
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు చేస్తామన్నారు.. కానీ ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు అని కుట్ర మొదలు పెట్టారన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బస్టాండ్లు కుదువ పెడుతున్నారని, రేవంత్ రెడ్డి ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదని ఆరోపించారు. ఏడాదికి రూ.100 కోట్లు లాభం వచ్చే విధంగా కేసీఆర్ కార్గోను తీసుకు వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్గోను ప్రైవేటుకు అమ్ముతున్నారని మండిపడ్డారు. కమీషన్ల…
KTR Hhouse Arrest: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమం ప్రకటించారు. ఈ రోజు ఉదయం బస్ భవన్ కి సిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఉదయం 8.45కి రేతిబౌలి నుంచి బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కేటీఆర్, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు నిర్ణయించారు. ముందుగానే రంగంలోకి దిగిన పోలీసులు.. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ […]
Coldref Cough Syrup Case: దగ్గు మందుతో చిన్నారుల మరణాల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. మధ్యప్రదేశ్‌లో ‘కోల్డ్రిఫ్’ దగ్గుమందు కారణంగా పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం స్పందించింది. తాజాగా ప్రాణాంతకమైన "కోల్డ్రిఫ్" దగ్గు సిరప్ కేసులో మధ్యప్రదేశ్ పోలీసులు పెద్ద పురోగతిని సాధించారు. SRESAN MEDICALS యజమాని రంగనాథన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కలుషితమైన కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తాగి 20 మంది పిల్లలు మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రంగనాథన్‌ను…
Telangana Local Body Elections 2025: నేడు తెలంగాణలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.. రెండు విడతల్లో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 10.30 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నేటి నుంచి ఈనెల 11 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఈనెల 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈనెల 15 వరకు గడువు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించనున్నారు. ఈనెల 23న మొదటి విడత MPTC, ZPTC పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్…
Trump: గాజాలో రెండు సంవత్సరాలు కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని చారిత్రక, అపూర్వమైన అడుగుగా అభివర్ణించారు. ఈజిప్టులో జరిగిన చర్చల అనంతరం.. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ బందీలను విడుదల చేస్తుందని, ఇజ్రాయెల్ తన దళాలను అంగీకరించిన లైన్‌కు తిరిగి తీసుకువస్తుందని ట్రంప్ తెలిపారు. ఇరు దేశాలు 20 పాయింట్ల శాంతి ఒప్పందంపై సంతకం చేసినట్లు స్పష్టం చేశారు.
Fire Accident: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అనపర్తి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై తాజాగా సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
Guntur Murder: తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నదని సొంత చెల్లి, బావపై పగబట్టాడు.. పెళ్లి చేసుకున్నప్పటినుంచి చపుతానంటూ బెదిరించేవాడు... చివరకు అనుకున్నంత పని చేశాడు... బావను నడిరోడ్డుపై అత్యంత దారుణంగా హత్యచేశాడు బావమరిది.. దీంతో కసాయి బావమరిదిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతుడి కుటుంబ సభ్యులు.. ఎత్తు తక్కువ ఉన్న(పొట్టి) వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కారణంతో నడి రోడ్డు చెల్లి భర్తను పొడిచి చంపాడని మృతుడి బంధువులు చెబుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది.
YV Subba Reddy: రైతుల పక్షాన పోరాడి యూరియా కష్టాలు తీర్చటానికి కృషి చేశామని వైవి.సుబ్బారెడ్డి అన్నారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. NTR జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో వైవి.సుబ్బారెడ్డి మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మా దృష్టిలో ఉన్నాం.. ఎవరు కేసులకు భయపడాల్సిన పని లేదు.. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. డయేరియా బాధితులను అలాగే వదిలేసిందని ఆరోపించారు. ఎవరి ఎన్ని తప్పులు…
H1B Visa: డోనాల్డ్ ట్రంప్ పేల్చిన H1B వీసా ఫీజు పెంపు బాంబు ప్రభావం మన దేశంలో కనిపించడం ప్రారంభమైంది. ఈ దుష్ప్రభావం భారతీయ వివాహాలపై కనిపిస్తోంది. వీసా రుసుము $100,000 (సుమారు రూ. 88 లక్షలు) కు పెంచిన వెంటనే.. అమెరికాలో పనిచేసే NRI వరులకు డిమాండ్ తగ్గింది. ఒక నివేదిక ప్రకారం.. ఇప్పటివరకు తమ పిల్లలకు అంతర్జాతీయ సంబంధాలు చూస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా నిర్ణయాన్ని మార్చుకున్నాయి. ట్రంప్ విధానాల కారణంగా NRIల ఉద్యోగ ప్రమాదం గురించి ఆందోళన చెందుతున్నాయి.