Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. జీడిమెట్లలో 220 కిలోల ఏపీడ్రిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.72 కోట్లు ఉంటుందని అంచనా.. బొల్లారంలోని సాయి దత్తా రెసిడెన్సీ ఫ్లాట్‌పై దాడి చేసి.. ఫ్లాట్ నుంచి 220 కిలోల ఏపీడ్రిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ కింగ్ పిన్ శివ రామకృష్ణ, అనిల్, వెంకట కృష్ణారావు, దొరబాబు అరెస్ట్ చేసింది ఈగల్ టీం. మరో నిందితుడు సూళ్లూరుపేటకు చెందిన ఎం. ప్రసాద్ పరారీలో ఉన్నాడు. డ్రగ్ తయారీ కేంద్రం…
Rape Case: బీహార్‌లోని ఆత్మగోలాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసులు 12 గంటల్లోనే కేసును ఛేదించి, అదే గ్రామానికి చెందిన నిందితుడైన ఓ యువకుడు, అతని తల్లిని అరెస్టు చేశారు. ఆ బాలిక మేకలను మేపడానికి వెళ్ళినప్పుడు.. యువకుడు నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం విద్యుత్ షాక్ ఇచ్చి చంపాడు. నిందితుడి తల్లితో కలిసి ఆ మృతదేహాన్ని పొలంలో పడేశారు.
Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి విజేతను ఈరోజు ప్రకటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ అవార్డు అందుకోవాలని తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే.. వైట్ హౌస్ ప్రచారం మొదలు పెట్టింది. సోషల్ మీడియాలో ట్రంప్‌ను "ది పీస్ ప్రెసిడెంట్" అని ప్రకటించింది. ఇది నోబెల్ శాంతి అవార్డు కోసం ట్రంప్ చేసిన ప్రచారంలో ఇది భాగం.
Donald Trump: నేడు ట్రంప్‌కు గుడ్ ఫ్రైడే అవుతుందా? బ్యాడ్ ఫ్రైడే అవుంతుందా? అని చర్చ జోరందుకొంది. నేడు నోబెల్ బహుమతి ప్రకటించనున్నారు. ది పీస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ వరిస్తుందా? అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. శాంతి అధ్యక్షుడు అని తనకు తాను బిరుదు ఇచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్ నార్వేజియన్ నోబెల్ కమిటీ గుర్తింపు కోసం ఒత్తిడి తెస్తుండటంతో 2025 నోబెల్ శాంతి బహుమతి ప్రకటన తీవ్ర ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. గాజా, ఇజ్రాయెల్, […]
BJP MLA Venkataramana Reddy: హైడ్రా ధనవంతుల కట్టడాలను కూల్చడం లేదని.. కేవలం సామాన్యుల ఇళ్లను కూలుస్తోందని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా కూల్చడం తప్ప ఇప్పటివరకు చేయగలిగింది ఏం లేదన్నారు... అన్ని అనుమతులు తీసుకుని కట్టుకున్న ఇళ్లను కూడా కూలుస్తున్నారని గుర్తు చేశారు. చెరువులు, కుంటలను మొత్తం కబ్జాలు చేస్తున్నారన్నారు.. ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న వారికి కజ్జా భూములకు సైతం అనుమతిలిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు కబ్జా ఆక్రమణలు, నిర్మాణాలపై హెచ్ఎండీఏ, రేరాకు సాక్ష్యాలతో…
CM Revanth Reddy: ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని పరిస్థితులను ఎదుర్కొని ముందుకెళుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇవాళ్టి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. వివిధ జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీ మంత్రులు ముఖ్య నాయకులతో సమావేశమై రిజర్వేషన్ల దామాషా ప్రకారం అభ్యర్థులను ఫైనల్ చేయాలని సూచించారు.
MLC Kavitha: గ్రూప్-1 విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు చాలా కార్యక్రమాలు చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 15 తారీఖున డివిజన్ బెంచ్ తీర్పుపై విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. గ్రూప్1 నియామకాలపై సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో అనంతరం మీడియాతో మాట్లాడారు. అందుకే 15 వరకు కార్యక్రమాలు తీసుకుందామని నిర్ణయించినట్లు చెప్పారు. నిన్న విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పించి వారి సాక్షిగా పోరాటం ప్రారంభించామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపేందుకే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు…
BRS Protest: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. కేటీఆర్ తలసాని, పద్మారావు రెత్తిఫైల్ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కిన ఆర్టీసి క్రాస్ రోడ్ బస్ భవన్‌కు చేరుకున్నారు. మరోవైపు.. హరీష్‌రావు మెహిదీపట్నం నుంచి బస్సులో ప్రయాణించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు. బస్ భవన్ లోపలికి వెళ్లేందుకు ఎమ్మెల్యేలకు మాత్రమే అనుమతిచ్చారు.
Telangana Local Body Elections 2025: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.. రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.. తొలివిడతలో మొదటి విడతలో మొత్తం 53 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 292 మండలాల పరిధిలో ఉన్న 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.. నేటి నుంచి ఎల్లుండి వరకు తొలివిడత నామినేషన్లు స్వీకరిస్తారు.. 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్ జరగనుంది... ఈనెల 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎంపీటీసీలకు మండల కార్యాలయాల్లో, జడ్పీటీసీల కోసం…
Hyderabad: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ప్రారంభమైన ‘ఐ లవ్ మహ్మద్’ వివాదం ఉత్తరాఖండ్, తెలంగాణ, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలకు పాకింది. ఉన్నావ్, బరేలీ, కౌశాంబి, లక్నో, మహారాజ్‌గంజ్, కాశీపూర్, హైదరాబాద్ వంటి నగరాల్లో మైనార్టీలు సామూహిక ప్రదర్శనలు, ర్యాలీలు చేపట్టారు. అయితే.. ఇప్పుడిప్పుడే ఈ వివాదం కుదుటపడుతోంది. యూపీలో ఈ వివాదాన్ని సర్దుమనిగించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. తాజాగా హైదరాబాద్‌లో కొంత మంది ముస్లిం యువకులు మరోసారి ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. చంద్రాయన్‌గుట్టలో ‘ఐ లవ్ మహ్మద్’ బ్యానర్ ఏర్పాటు చేశారు.