Mojtaba Khamenei: “సముద్ర గర్భంలో పాతిపెడతాం”.. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mojtaba Khamenei: అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గల్ఫ్ ప్రాంత భద్రతను ఇకపై ఇరాన్ స్వయంగా చూసుకుంటుందని, ఈ సముద్ర మార్గంలో శత్రువుల జోక్యాన్ని ఇకపై ఏమాత్రం సహించేది లేదని తెగేసి చెప్పారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అలజడి సృష్టించే విదేశీ శక్తులకు ఇక్కడ చోటు లేదని, ఒకవేళ ఎవరైనా అతిక్రమిస్తే వారిని సముద్ర గర్భంలో పాతిపెడతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను తొలగించాలన్న ప్రతిపాదనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించిన నేపథ్యంలో ఖమేనీ ఈ ప్రకటన చేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఆంక్షలు ఎత్తివేసే వరకు కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ మార్గాన్ని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేస్తోంది. మార్చి నెల నుంచి ఈ మార్గం మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయి, గ్లోబల్ ఎకానమీపై తీవ్ర ప్రభావం పడుతోంది. గల్ఫ్, హోర్ముజ్ ప్రాంతాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైందని, ఇక్కడ ఏర్పాటు కాబోయే కొత్త వ్యవస్థ వల్ల శాంతి నెలకొనడమే కాకుండా పొరుగు దేశాలకు ఆర్థిక ప్రయోజనాలు సైతం దక్కుతాయని ఖమేనీ ధీమా వ్యక్తం చేశారు.
అదే సమయంలో అమెరికా ఉనికిపై సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పర్షియన్ గల్ఫ్‌లో అభద్రతకు అమెరికా ఉండటమే ప్రధాన కారణమని, తమ స్వంత స్థావరాలనే రక్షించుకోలేని అమెరికా ఇతర దేశాలకు ఏం రక్షణ కల్పిస్తుందని ఎద్దేవా చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో పలు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ చమురు వ్యాపారం ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఇతర గల్ఫ్ దేశాలతో సమన్వయం పెంచుకుని ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తోంది. ఇదే క్రమంలో శత్రువులను వణికించేలా ఇరాన్ నేవీ కమాండర్ ఒక శక్తివంతమైన కొత్త ఆయుధాన్ని ప్రస్తావించగా, వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ జోక్యం చేసుకునే వారికి సముద్రపు లోతులే గతి అని ఖమేనీ హెచ్చరించారు.
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
తాజావార్తలు
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్‌డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!