Indian Origin Cricketer: ఆ క్రికెటర్‌కు బిగ్‌షాక్ ఇచ్చిన ఐసీసీ.. 8 ఏళ్లు నిషేధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాకు చెందిన 26 ఏళ్ల భారత సంతతి క్రికెటర్ బొడుగుమ్ అఖిలేష్ రెడ్డిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కఠిన చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు రుజువు కావడంతో అతడిపై ఎనిమిదేళ్లపాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. 2025 అబుదాబి T10 టోర్నమెంట్లో ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతడిని దోషిగా నిర్ధారించారు. ఈ నిషేధం నవంబర్ 21, 2025 నుండి అమల్లోకి వచ్చినట్లు పరిగణించబడుతుంది. అప్పుడే అతడిపై తాత్కాలిక నిలిపివేత వేటు పడింది. ఈ నిషేధం నవంబర్ 2033 వరకు కొనసాగుతుంది. హైదరాబాద్‌లో పెరిగిన అఖిలేష్ రెడ్డి కుడిచేతి వాటం బ్యాటర్, ఆఫ్ స్పిన్ బౌలర్. ఇతడు అమెరికా జాతీయ జట్టు తరఫున 2025లో నాలుగు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.
అబుదాబి T10 టోర్నమెంట్ సమయంలో ఐసీసీ యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ అఖిలేష్ రెడ్డిని మూడు నిబంధనల ఉల్లంఘనకు బాధ్యుడిగా పేర్కొంది. మ్యాచ్ ఫలితాన్ని లేదా మ్యాచ్‌లోని ఇతర అంశాలను అక్రమంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం ద్వారా ఆర్టికల్ 2.1.1ను ఉల్లంఘించాడు. అలాగే మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తన తోటి ఆటగాడిని ప్రోత్సహించడం, ప్రలోభపెట్టడం, ప్రేరేపించడం ద్వారా ఆర్టికల్ 2.1.4ను ఉల్లంఘించినట్లు తేలింది. దీనికి తోడు.. విచారణ ప్రారంభమైన సమయంలో తన మొబైల్ ఫోన్ నుండి చాట్లు, కాల్ రికార్డులు , డేటాను డిలీట్ చేసి దర్యాప్తుకు ఆటంకం కలిగించినందుకు ఆర్టికల్ 2.4.7 ప్రకారం దోషిగా తేలాడు.
Also Read
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ఈ ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిషేధంతో అఖిలేష్ రెడ్డి క్రికెట్ కెరీర్ దాదాపు ముగిసినట్లే భావిస్తున్నారు. ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్‌ను ఉల్లంఘించి చర్యలకు గురైన అమెరికా రెండో అంతర్జాతీయ ఆటగాడిగా ఇతడు నిలిచాడు. అంతకుముందు 2023-24 సీజన్లో బార్బడోస్ బీమ్10 టోర్నమెంట్లో ఐసీసీ నిబంధనలను ఐదుసార్లు ఉల్లంఘించినందుకు అమెరికా బ్యాటర్ ఆరోన్ జోన్స్‌పై కూడా తాత్కాలిక నిషేధం విధించబడింది. సక్రమమైన పద్ధతిలో క్రీడలను నిర్వహించేందుకు ఐసీసీ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది.
తాజావార్తలు
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!