IPL 2026 సీజన్‌లో 41 మ్యాచ్‌ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Run Fest Explained: టీ20 క్రికెట్ ప్రపంచంలో ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) అంటేనే ఒక సరికొత్త ప్రయోగశాలకు నాంది. సరికొత్త రికార్డులు, నరాలు తెగే ఉత్కంఠకు ఐపీఎల్ పెట్టింది పేరు. సాధారణంగా టీ20 ఫార్మాట్ అంటేనే బ్యాటర్ల ఆధిపత్యం, సిక్సర్లు, ఫోర్ల వర్షం అని మనందరికీ తెలిసిందే. మైదానంలో బ్యాటర్లు తమ పవర్-హిట్టింగ్‌తో విరుచుకుపడుతుంటే.. ప్రేక్షకులు ఆ వినోదాన్ని ఎంతో ఆస్వాదిస్తుంటారు. అయితే.. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈ పరుగుల వరద మునుపెన్నడూ చూడని స్థాయికి చేరుకుంది. గతంలో అరుదుగా కనిపించే 200 ప్లస్ స్కోర్లు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. ఈ సీజన్‌లో కేవలం 41 మ్యాచ్‌లు ముగిసే సమయానికే 10 సార్లు 200కు పైగా టార్గెట్లు ఛేజ్ అయ్యాయి. ఇది ఒక సరికొత్త ఐపీఎల్ రికార్డ్. ఇంకా ఈ సీజన్‌లో 33 మ్యాచ్‌లు మిగిలే ఉండటం విశేషం. గత ఏడాది అంటే 2025లో మొత్తం 74 మ్యాచ్‌ల్లో 9 సార్లు మాత్రమే ఈ ఘనత నమోదైతే, ఈసారి సగం సీజన్‌కే ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. గత రెండు సీజన్లలో కలిపి జరిగిన 19 భారీ రన్ ఛేజ్‌లలో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే చివరి ఓవర్ వరకు వెళ్లాయంటే, బ్యాటర్లు ఎంతటి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇక.. ఈ భారీ స్కోర్ల వెనుక ఉన్న అసలు రహస్యం కేవలం బ్యాటర్ల ఫామ్ మాత్రమే కాదు, నిబంధనల్లో వచ్చిన మార్పులే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇలా పరుగుల సునామీ రావడానికి ప్రధాన కారణం 2023లో ప్రవేశపెట్టిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిబంధన వల్ల జట్ల బ్యాటింగ్ డెప్త్ పెరిగింది. ‘ఇంపాక్ట్ ప్లేయర్’ వంటి వెసులుబాటు వల్ల జట్లు ఎనిమిదో స్థానంలోనూ అద్భుతమైన బ్యాటర్‌ను పంపగలుగుతున్నాయి. దీనివల్ల బ్యాటర్లకు అదనపు ధైర్యం లభించి, తొలి బంతి నుంచే విరుచుకుపడుతున్నారు. ఫలితంగా బంతికి, బ్యాట్‌కు మధ్య ఉండాల్సిన సమతుల్యత దెబ్బతిని, బౌలర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక 2008 నుంచి 2022 వరకు అంటే దాదాపు 15 ఏళ్ల కాలంలో కేవలం 15 సార్లు మాత్రమే 200 పైచిలుకు స్కోర్లు ఛేజ్ అయితే, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన ఈ మూడు నాలుగేళ్లలోనే 33 సార్లు భారీ లక్ష్యాలు కరిగిపోయాయి. దీనికి తోడు ఫ్లాట్ పిచ్‌లు సైతం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో బౌలర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
అసలు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వివరాలు..
ప్రతి జట్టు మ్యాచ్‌కు ముందు 11 మంది ఆటగాళ్లతోపాటు నలుగురు సబ్‌స్టిట్యూట్‌లను ప్రకటించాలి. ఆ నలుగురిలో ఒకరిని ఇంపాక్ట్ ఆటగాడిగా ఆడించేందుకు అవకాశం ఉంటుంది. తుది జట్టులో విదేశీ ఆటగాళ్లు నలుగురు ఉంటే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్‌గా భారత క్రికెటర్‌నే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఆడించుకోవచ్చు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అనుకుంటే.. బ్యాటర్ స్థానంలో స్పిన్నర్‌ను ఇంపాక్ట్ ఆటగాడిగా ఆడించొచ్చు. ఒకవేళ ఛేదనలో అదనపు బ్యాటర్ అవసరం ఉంది అనుకుంటే.. అప్పుడు ఓ బౌలర్ స్థానంలో బ్యాటర్‌ను తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఇంపాక్ట్ ఆటగాడి కోసం మైదానం వీడిన క్రికెటర్ మళ్లీ మ్యాచ్‌లో కొనసాగే అవకాశం ఉండదు. ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు లేదా ఓవర్ ముగిశాక లేదా వికెట్ పడ్డాక లేదా ఓ బ్యాటర్ రిటైరయ్యాకే ఇంపాక్ట్ ఆటగాడు మైదానంలోకి రావాల్సి ఉంటుంది. అప్పటికే రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన బౌలర్ స్థానంలో వచ్చే ఇంపాక్ట్ ఆటగాడు తన పూర్తి కోటా నాలుగు ఓవర్లు వేసే అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆటగాడు కెప్టెన్‌గా మాత్రం బాధ్యతలు నిర్వర్తించకూడదు. 11 మంది మాత్రమే బ్యాటింగ్ చేయాలి.
తాజావార్తలు
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!