The Raja Saab: ఏపీలో నేటి నుంచి ‘ది రాజాసాబ్’ టికెట్ ధరలు భారీగా పెరిగాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు.. ప్రీమియర్ షోలతో పాటు ఐదో షోకు సైతం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సినిమాకి సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధరపై రూ.150 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌లలో రూ.200 (జీఎస్టీతో కలిపి) పెంచుకోడానికి అనుమతి లభించింది. ఇవాళ్టి ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 1000గా నిర్ణయం తీసుకున్నారు.. సాయంత్రం 6 గంటల నుంచి అర్థరాత్రి 12లోపు స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చారు.. రేపటి నుంచి 10 రోజుల పాటు టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది..
READ MORE: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?