-
NCSC: మతం మారిన దళితులకు షాక్.. ఎస్సీ హోదా రద్దు చేసే అవకాశం?
మతం మారిన దళితులకు పెద్ద షాక్ ఎదురుకావచ్చు. ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ హోదా ఇవ్వడాన్ని ఎన్‌సిఎస్‌సి అంటే నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ వ్యతిరేకిస్తుందని వార్తలు వస్తున్నాయి. మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించడంపై విచారణ జరిపిన విచారణ కమిషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏడాది పొడిగించిన సంగతి తెలిసిందే. -
PM Modi: 3 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ హామీ..
జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తోంది. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. జార్ఖండ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తర్వాత, ప్రధాని మోడీ కూడా ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు. సోమవారం గర్వాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. గిరిజన సంఘం, అవినీతి, బంధుప్రీతి తదితర అంశాలపై జార్ఖండ్‌లోని అధికార పార్టీని తన ప్రసంగంలో ప్రధాని లక్ష్యంగా చేసుకున్నారు. -
Air force plane crashes: కూలిన ఎయిర్ ఫోర్స్ విమానం.. పోలాల్లో పడి బూడిదైన జెట్..
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రాలోని కగరౌల్‌లోని సోనిగా గ్రామ సమీపంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం కూలిపోయింది. విమానం ఖాళీ పొలాల్లో పడిపోయింది. విమానం నేలపై పడిన వెంటనే మంటలు చెలరేగాయి. విమానంలో పైలట్‌తో సహా ఇద్దరు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం విశేషం. ఇది ఎయిర్‌ఫోర్సుకు చెందిన మిగ్-29 జెట్ విమానంగా గుర్తించారు. పంజాబ్ అదంపూర్ నుంచి ఆగ్రా వెళ్తుండగా ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న ఎయిర్‌ఫోర్స్ […] -
India’s Manufacturing Sector Surges: చైనా ఆట ముగిసింది?.. తయారీ రంగంలో దూసుకుపోతున్న భారత్
తయారీ రంగంలో గొప్పగా చెప్పుకునే చైనా ఇప్పుడు ఇందులో చాలా వెనుకబడిపోయింది. ఒకవైపు చైనా ఆర్థిక వృద్ధి చాలా నెమ్మదిగా ఉండగా.. భారత్‌కు శుభవార్త అందింది. హెచ్ఎస్డీసీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. భారత్ యొక్క తయారీ రంగం అక్టోబర్‌లో విస్తరించింది. ఈ విషయంలో భారత్ చైనాను అధికమించిందని నివేదిక తెలిపింది. ఈ పెరుగుదలకు కారణం విదేశాల్లో భారత్ వస్తువులకు డిమాండ్ పెరిగింది. భారతదేశం ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కొత్త ఆర్డర్లను అందుకోవడమే కాకుండా అమ్మకాలు కూడా పెరిగాయి. -
GST Dept: పద్మనాభ స్వామి ఆలయానికి రూ.1.57 కోట్ల జీఎస్టీ నోటీసులు..
కేరళలోని తిరువనంతపురంలో పద్మనాభ స్వామి ఆలయం ఉంది. చాలా సంవత్సరాలుగా భక్తులు స్వామివారిని విశ్వసిస్తూ.. దర్శించుకుంటున్నారు. తాజాగా ఈ టెంపుల్‌కి సంబంధించిన ఓ వార్తపై భక్తులు ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు. అయితే.. రూ.1.57 కోట్ల జీఎస్టీని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆలయ నిర్వాహకులకు జీఎస్టీ విభాగం నోటీసు పంపింది. ఏడేళ్లుగా ఆలయంపై జీఎస్టీ బకాయి ఉందని నోటీసులో పేర్కొంది. -
Banke Bihari temple: చరణామృతంగా భావించి.. ఏసీ నుంచి వచ్చే నీటిని తాగుతున్న భక్తులు(వీడియో)
ఉత్తర ప్రదేశ్‌లోని మధుర జిల్లా బృందావన్‌లోని బాంకే బిహారీ ఆలయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఇందులో.. కొంతమంది భక్తులు ఆలయం వెనుక భాగం నుంచి కారుతున్న నీటిని చరణామృతంగా భావించి తాగడం కనిపిస్తుంది. నిజానికి ఇది ఆలయంలో ఏర్పాటు చేసిన ఏసీ నుంచి విడుదలయ్యే నీరు. -
Supreme Court: నిషేధం ఉన్నప్పటికీ పటాకులు ఎలా కాల్చారు.. ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు చివాట్లు
ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. అగ్నిప్రమాదాలను నిషేధించాలని ఆదేశించినా పెద్దఎత్తున క్రాకర్లు ఎలా కాల్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల నుంచి పటాకులు తెస్తున్నారని న్యాయమూర్తి అన్నారు. దీపావళికి ప్రజకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయకపోవడంతో ప్రజల్లో అవగాహన కొరవడిందని తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం, పోలీసు కమిషనర్ వారంలోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. -
Whatsapp Ban Indian Accounts: వాట్సప్ యూజర్స్‌కి షాక్.. 85 లక్షల ఖాతాలు బ్లాక్
సెప్టెంబర్‌లో పాలసీని ఉల్లంఘించిన 85 లక్షలకు పైగా భారతీయ వాట్సాప్ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. కంపెనీ తన నెలవారీ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వినియోగదారుల భద్రతను పెంచడానికి, ప్లాట్‌ఫారమ్‌ను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి కంపెనీ ఈ చర్య తీసుకుంది. అంతకుముందు ఆగస్టులో భారతదేశంలో 84 లక్షల ఖాతాలు నిషేధించబడ్డాయి. -
Election Commission: ఈసీ కీలక నిర్ణయం.. ఉప ఎన్నికల తేదీలో మార్పు..
ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 13న కేరళ, పంజాబ్, యూపీలో జరగాల్సిన ఉప ఎన్నికలను ఈనె 20వ తేదీకి వాయిదావేసింది. ఇప్పుడు నవంబర్ 20న జరగనున్నాయి. వివిధ పండుగల కారణంగా ఓటింగ్‌ను వారం రోజులు వాయిదా వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 13న జరగాల్సిన ఓటింగ్‌ను వాయిదా వేయాలని కాంగ్రెస్, బీజేపీ సహా పలు పార్టీలు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. -
India-Bangladesh: భారత్‌పై బంగ్లాదేశ్ చాకచక్యం.. మాల్దీవులతో కలిసి కొత్త గేమ్!
షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి ఇండియా వచ్చినప్పటి నుంచి అక్కడి హిందువుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. మహ్మద్ యూనస్ ఎన్ని వాదనలు చేసినా, తెరవెనుక భారత్‌పై చాకచక్యం ప్రదర్శించడం మానుకోవడం లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ మాల్దీవుల సాయం తీసుకుని భారత్‌తో ‘ఆడుతోంది’. బంగ్లాదేశ్ ప్రపంచంలోని రెండవ అతిపెద్ద వస్త్ర ఉత్పత్తి దేశం.
తాజావార్తలు
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!