Airtel: 37.5 కోట్ల భారతీయ కస్టమర్ల డాటా హ్యాక్..స్పందించిన ఎయిర్‌టెల్
- 37 కోట్ల మందికి పైగా వినియోగదారుల డేటాను తాను దొంగిలించానని పేర్కొన్న హ్యాకర్
- కస్టమర్ల వ్యక్తిగత వివరాలను ప్రముఖ హ్యాకింగ్ ఫోరమ్‌లో విక్రయానికి ఉంచినట్లు ప్రకటన
- ఒక్కసారిగా ఆందోళనకు గురైన వినియోగదారులు
- తమ సిస్టమ్‌ల నుంచి ఎటువంటి ఉల్లంఘన జరగలేదని నిర్ధారించిన ఎయిర్‌టెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలోని టాప్ టెలికాం కంపెనీల్లో ఒకటిగా పరిగణించబడుతున్న ఎయిర్‌టెల్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇటీవల రీఛార్జ్ ప్లాన్ లను పెంచిన సంగతి తెలసిందే. కానీ ప్రస్తుతం కంపెనీకి చెందిన 37 కోట్ల మందికి పైగా వినియోగదారుల డేటాను తాను దొంగిలించానని ఓ హ్యాకర్ పేర్కొన్నాడు. కస్టమర్ల వ్యక్తిగత వివరాలను ప్రముఖ హ్యాకింగ్ ఫోరమ్‌లో విక్రయానికి ఉంచుతున్నట్లు ఓ హ్యాకర్ తాజాగా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా వినియోగదారులు కంగారు పడ్డారు. ఇది భారతదేశంలో ఆందోళన కలిగించే అంశంగా మారింది. తాజాగా ఈ ప్రకటనపై ఎయిర్‌టెల్ స్పందించింది.
READ MORE: CM Chandrababu: ఐదేళ్లలో ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తాం..
Also Read
- Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
ఎయిర్‌టెల్ ఇండియా డేటా ఉల్లంఘన ఆరోపణలపై స్పందిస్తూ.. తాము క్షుణ్ణంగా దర్యాప్తు చేశామని, ఎయిర్‌టెల్ సిస్టమ్‌ల నుంచి ఎటువంటి ఉల్లంఘన జరగలేదని నిర్ధారిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. డార్క్ వెబ్ ఇన్‌ఫార్మర్ ద్వారా వెలువడిన తప్పుడు డేటా ఉల్లంఘనగా దీన్ని అభివర్ణించింది. దీంతో ఎయిర్ టెల్ యూజర్లు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే అంతకు ముందు డార్క్ వెబ్‌లో ఓ పోస్ట్ ప్రకారం, ‘xenZen’ అనే మారుపేరుతో హ్యాకర్ 37.5 కోట్ల మంది ఎయిర్‌టెల్ ఇండియా కస్టమర్ల మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, ఆధార్ ఐడీ, ఇమెయిల్ ఐడీ, ఇతర వివరాలతో కూడిన డేటాబేస్‌ను విక్రయానికి ప్రయత్నించాడు. క్రిప్టోకరెన్సీలో చెల్లించాల్సిన దీనికి 41 లక్షల రేటు పెట్టాడు. దీంతో కస్టమర్లు కంగారు పడ్డారు. స్పందించిన టెలికాం కంపెనీ తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నాడని..ప్రకటించింది.
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!