Recharge Price Hike: సామాన్యలకు బిగ్‌షాక్.. భారీగా పెరగనున్న మొబైల్ రీచార్జ్ ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Recharge Price Hike: సామాన్యులకు మరో బిగ్‌షాక్ తగిలింది. టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు దిశగా అడుగులు పడుతున్నాయి. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మొబైల్ టారిఫ్‌లను సుమారు 15 శాతం పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పెంపు 2026 జూన్‌లో అమలులోకి వచ్చే అవకాశం ఉందని జెఫ్రీస్ నివేదిక వెల్లడించింది. గతంలో జరిగిన ధరల సవరణల ట్రెండ్‌కు ఇదే సరైన కాలమని ఆ నివేదిక పేర్కొంది. ధరలు పెరగడమే కాకుండా, దేశంలో డేటా వినియోగం వేగంగా పెరగడం, ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల వైపు వినియోగదారులు మారడం వల్ల ఒక్కో వినియోగదారుడిపై వచ్చే ఆదాయం క్రమంగా పెరుగుతూనే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల టెలికాం కంపెనీల ఆదాయ వృద్ధికి బలమైన మద్దతు లభిస్తోంది.
Also Read
- Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
- రూ.1.3 లక్షల విలువైన iPhone 17 Pro.. కేవలం రూ.56 వేలకే.. ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
- iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
2026లో జరిగే రీచార్జ్ ధరల పెంపు ప్రభావంతో 2027 ఆర్థిక సంవత్సరంలో టెలికాం రంగ ఆదాయం సుమారు 16 శాతం పెరుగుతుందని అంచనా. ఇది 2026లో 7 శాతం వృద్ధితో పోలిస్తే దాదాపు రెండింతలు. టారిఫ్‌లు 15 శాతం పెరిగితే, ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం కూడా 2027లో సగటున 14 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ధరలు పెరగడం వల్ల కొత్త వినియోగదారుల చేరిక కొంత మందగించే అవకాశం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది. ధరల పెంపు ప్రభావం కంపెనీల వారీగా భిన్నంగా ఉండనుంది. రిలయన్స్ జియో తన సేవల ధరలను 10 నుంచి 20 శాతం వరకు పెంచే అవకాశముందని అంచనా. దీని ద్వారా భారతి ఎయిర్‌టెల్‌తో సమానంగా తన విలువను నిలబెట్టుకోవడం, పెట్టుబడిదారులకు మంచి లాభాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, అప్పుల్లో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా పరిస్థితి మరింత కఠినంగానే ఉంది. భారీ ప్రభుత్వ బకాయిలను తీర్చేందుకు 2027 నుంచి 2030 మధ్య కాలంలో మొత్తం మీద సుమారు 45 శాతం వరకు సేవల ధరలు పెంచాల్సిన పరిస్థితి రావొచ్చని అంచనా.
ప్రస్తుతం వొడాఫోన్ ఐడియాకు చెందిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ బకాయిలు 2032 నుంచి చెల్లించడం ప్రారంభించి 2041 వరకు కొనసాగనున్నాయి. ఐదేళ్ల పాటు మోరేటోరియం అమలైతే తక్షణ నగదు భారం కొంత తగ్గినా, నెట్‌వర్క్ పెట్టుబడులను కొనసాగించేందుకు కంపెనీకి ఇంకా భారీగా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక 5జీ నెట్‌వర్క్‌ల నిర్మాణం ప్రధాన దశ పూర్తవుతున్న నేపథ్యంలో, టెలికాం కంపెనీల ఖర్చులు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో లాభాల మార్జిన్లు మెరుగుపడతాయని అంచనా. 2027 వరకు పెట్టుబడి ఖర్చులు నియంత్రిత స్థాయిలోనే కొనసాగనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే, రాబోయే టారిఫ్ పెంపు టెలికాం రంగానికి ఆదాయ పరంగా కొత్త ఊపునివ్వనుందని విశ్లేషకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!