The Raja Saab: డార్లింగ్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.. సినిమా థియేటర్‌లలోకి వచ్చిన 24 గంటల్లోనే ఆన్ లైన్ లో రాజాసాబ్ మూవీ HD ప్రింట్ ప్రత్యేక్షమైంది. ఇప్పటికే టికెట్ల ధరల పెంపు విషయంలో ప్రభుత్వ మెమోను నిన్న హైకోర్టు కొట్టేసింది. ఆ దెబ్బ తేరుకోక ముందే రాజాసాబ్ మూవీని పైరసీ చేసి ఆన్‌లైన్ సైట్‌లో ప్రత్యక్షం కావడంతో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ అంశంపై ఓ వైపు.. మూవీ టీం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు.. ఫ్యాన్స్
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
READ MORE: రూ.13 వేలకే 10,000mAh బ్యాటరీ, 6.81 అంగుళాల 1.5K డిస్‌ప్లే.. Honor X80 స్పెక్స్ ఇవే!
అయితే.. నిన్న (శుక్రవారం) రోజున “ది రాజాసాబ్” సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తూ హోంశాఖ ఇచ్చిన మెమోను హైకోర్టు కొట్టేసింది. నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. హోంశాఖ కార్యదర్శికి మెమో జారీ చేసే అధికారం లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, హైదరాబాద్‌లో సీపీ మాత్రమే టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కోర్టుకు వివరించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ ధరల పెంచుతూ ఇచ్చిన మెమోను కొట్టేసింది. ఈ సందర్భం అధికార యంత్రాంగంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా మెమోలు ఎందుకు ఇస్తున్నారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. టికెట్ ధరలు పెంచబోమని సంబంధిత మంత్రే స్వయంగా ప్రకటించారని, అయినా కూడా ధరల పెంపునకు మెమోలు ఎందుకు ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మీ ఆలోచన మారడం లేదంటూ మండిపడింది. చివరకు మెమో కొట్టేసింది.