ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వైద్యుల నిర్లక్ష్యం ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ ప్రసవ సమయంలో ఓ గర్భిణి అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. వెంటనే వైద్యులు ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స సమయంలో ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. కడుపులో ఉన్న శిశువు కూడా మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇది విన్న వెంటనే కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అనంతరం అంత్యక్రియల అనంతరం అస్తికలు తీసుకునే సమయంలో ఓ వస్తువును గుర్తించిన భర్త వెంటనే పోలీసులకు సంప్రదించారు. ఈ ఘటన హస్తినాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
READ MORE: Home Minister Anitha: ముచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయం..
పోలీసుల కథనం ప్రకారం.. హస్తినాపూర్ పరిధిలోని రాథోరా ఖుర్ద్ గ్రామానికి చెందిన సందీప్ తన భార్య వనీత్ కౌర్ ను ప్రసవం కోసం మీరట్ జిల్లా మవానా పట్టణంలోని జేకే ఆసుపత్రిలో చేర్చారు. గర్భిణి పరిస్థితి విషమించడంతో వైద్యులు సర్జరీ చేశారు. ఆపరేషన్ సమయంలో ఆమెతో పాటు కడుపులో ఉన్న శిశువు కూడా మరణించింది. ఈ వార్త విన్న కుటుంబీకులు బోరున విలపించారు. అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేశారు. చితాభస్మాన్ని సేకరించేందుకు భర్త సందీప్ వచ్చారు. అప్పుడు మృతురాలి భర్తకు చితాభస్మంలో సర్జికల్ బ్లేడ్ కనిపించింది. బ్లేడు తీసుకుని నేరుగా పోలీసుల వద్దకు వెళ్లాడు. మహిళకు ఆపరేషన్ సమయంలో.. అదే సర్జికల్ బ్లేడ్ ఆమె కడుపులో మిగిలిపోయిందని, దాని కారణంగా ఆమె చనిపోయిందని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
READ MORE:Delhi: ప్రధాని మోడీతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భేటీ
అంత్యక్రియల చితిలో నుంచి బ్లేడ్ బయటకు రావడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ సమేతంగా సీఎంఓ కార్యాలయానికి కూడా వెళ్లారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆసుపత్రి లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు. దీంతోపాటు విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనుకోలేదని..కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతానికి ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. ఆరోపణలు నిజమని తేలితే వైద్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.