Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లిలో అతిథుల చేతికి రంగు రంగుల బ్యాండ్లు..ఎందుకో తెలుసా..?
- ప్రముఖుల చేతుల్లో రంగురంగుల బ్యాండ్‌లు
- బ్యాండ్ రంగు ప్రకారం అతిథులు సిట్టింగ్ జోన్‌లోకి ప్రవేశం
- వివాహానికి వచ్చే అతిథులకు క్యూఆర్ కోడ్ ద్వారా ఎంట్రీ
- అతిథులకు.. ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వీటి ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జూలై 14న జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌తో అనంత్, రాధికల వివాహ వేడుకలు ముగిశాయి. దీనికి ముందు.. అనంత్-రాధికల ఆశీర్వాద కార్యక్రమం జూలై 13న జరిగింది. అంబానీ కుటుంబీకుల ఈ గ్రాండ్ వెడ్డింగ్ ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనంత్, రాధికల వివాహానికి మన దేశం నుంచే కాక విదేశాల నుంచి సైతం సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరల్డ్ జియో సెంటర్‌లో బాలీవుడ్ ప్రముఖుల ఫెయిర్ కూడా నిర్వహించారు. అయితే పెళ్లిలో సెలబ్రిటీల ఎంట్రీ మాత్రం ప్రత్యేకంగా జరిగింది. చిత్రాలు మరియు వీడియోలలో ప్రముఖుల చేతుల్లో రంగురంగుల బ్యాండ్‌లను చూసే ఉంటారు. అయితే వాటి అర్థం మీకు తెలుసా?.. ఈ బ్యాండ్లపై రచయిత దుర్జోయ్ దత్తా భార్య అవంతిక వివరించింది. బ్యాండ్‌లు అనంత్ పెళ్లిలో సీటింగ్ ఏర్పాటును సూచిస్తాయని వెల్లడించింది.
READ MORE: Suicide: భార్యను ‘టీ’ చేయమని చెప్పిన భర్త.. ఆమె నిరాకరించడంతో ఆత్మహత్య
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
కాగా.. సెలెబ్స్ మాత్రమే కాకుండా విజిటింగ్ గెస్ట్‌లందరి చేతి మణికట్టు మీద రంగురంగుల బ్యాండ్‌లు ఉన్నాయి. అతిథుల సౌకర్యార్థం మాత్రమే వీటిని అందించారు. నిజానికి.. అతిథి ప్రవేశం బ్యాండ్ ప్రకారం నిర్ణయించబడింది. బ్యాండ్ రంగు ప్రకారం అతిథులు సిట్టింగ్ జోన్‌లోకి ప్రవేశించారు. పింక్ బ్యాండ్‌లు ధరించిన అతిథులు ప్రత్యేక సిట్టింగ్ జోన్‌ను కలిగి ఉండగా.. ఆరెంజ్ బ్యాండ్‌లు ధరించిన అతిథులు వేరే జోన్‌లో ప్రవేశించారు. ఈ బ్యాండ్ల సాయంతో అతిథులకే కాకుండా సెక్యూరిటీ సిబ్బందికి కూడా పనిలో ఎంతో సౌలభ్యం లభించింది. సీటింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అతిథులకు వివిధ రంగుల రిస్ట్‌బ్యాండ్‌లను అందజేస్తున్నట్లు సమాచారం. అనంత్ మరియు రాధికల వివాహానికి హాజరైన అతిథులందరూ, ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులతో సహా వారి చేతికి వివిధ రంగుల బ్యాండ్‌లు కట్టారు. ఇది కాకుండా.. అనంత్-రాధికల వివాహానికి వచ్చే అతిథులకు క్యూఆర్ కోడ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. సమాచారం ప్రకారం.. అతిథులకు ఆహ్వాన కార్డులు ఇవ్వడంతో పాటు, అంబానీ కుటుంబం క్యూఆర్ కోడ్‌లను కూడా అందించింది. కోడ్‌ని చూపుతూ అతిథులు పెళ్లిలోకి ప్రవేశించారు. దీని తరువాత..బ్యాండ్ ప్రకారం.. వారిని వారి సిట్టింగ్ జోన్‌లో కూర్చోబెట్టారు. దీని వల్ల అతిథులకు గానీ, ఉద్యోగులకు గానీ ఎలాంటి అసౌకర్యం కలగలేదు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!