యూట్యూబ్‌లో మరోసారి సబ్స్క్రైబర్ల యుద్ధం మొదలైంది. ఇంతకుముందు ఈ యుద్ధం ప్యూడీపీ, టీ-సిరీస్ మధ్య జరిగింది. ఇప్పుడు ఈ యుద్ధం ఒక అమెరికన్ యూట్యూబర్, టీ-సిరీస్ మధ్య జరుగుతోంది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ఇటీవల తన ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ (TTDI)ని విడుదల చేసింది. ఇందులో పాకిస్థాన్ టూరిజం పరిస్థితి దారుణంగా ఉంది. ట్రావెల్, టూరిజం పరంగా అత్యంత ప్రజాదరణ పొందిన 119 దేశాల జాబితాలో పాకిస్థాన్ 101వ స్థానంలో ఉంది.
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. వేడిమికి జనాలు అల్లాడుతున్నారు. ఈ వేడి వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. డీహైడ్రేషన్ సమస్యే కాకుండా కంటి ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది పొడి కళ్ళు, కంటి చికాకుకు దారితీస్తుంది.
ప్రపంచంలోని టాప్ బిలియనీర్ల జాబితాలో మార్పు చోటు చేసుకుంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టారు. గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లో లిస్టయిన అదానీ కంపెనీల షేర్లు భారీగా పెరగడంతో అతని సంపద (గౌతమ్ అదానీ నెట్‌వర్త్) భారీగా పెరిగి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు.
తెలంగాణలో బీరు తయారు చేసే బ్రూవరీస్ కంపెనీలకు మూడో షిప్టు అనుమతించక పోవడంతో కృత్రిమ కొరత ఏర్పడిరదని మీడియాలో వచ్చిన కథనం సత్యదూరమని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్టుమెంట్ కమిషనర్ శ్రీధర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. జూన్ 2న ఉదయం 9.30కు గన్ పార్క్‌లో అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు.
ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ రాశారు. వ్యక్తిగత ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు రేవంత్ సూచించారు.
"జయ జయహే తెలంగాణ" గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ధి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని బీజేపీ ఆరోపించింది.