హైదరాబాద్, 28 జూలై, 2024: భారతదేశంలో పీడియాట్రిక్ కేర్ విభాగంలో మార్గదర్శక సంస్థలలో ఒకటైన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, దేశంలోని పెద్ద వయసు వ్యక్తులకు టీకాలు వేయాలనే లక్ష్యంతో అవాన్ (AVON) – అడల్ట్ వ్యాక్సినేషన్ ఔట్చ్ నెట్వర్ను ప్రారంభించింది. పీడియాట్రిక్ రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థ ఇప్పుడు పెద్ద వయసు వ్యక్తులకు టీకాలు వేయడానికి సిద్ధమైనది. ఈ AVON కార్యక్రమం ను జూలై 28న హైదరాబాద్లోని షెరటన్ హోటల్లో నిర్వహించారు.
దేశంలోని పిల్లలకు, మహిళలకు నాణ్యమైన వైద్య సంరక్షణ మరియు సేవలను అందించడంలో 25 సంవత్సరాల అనుభవం కలిగిన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ AVON ద్వారా పెద్ద వయసు వ్యక్తులకు రోగనిరోధక అవసరాలను తీర్చాలనుకుంటోంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్లు మరియు క్యాన్సర్ను నిరోధించే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, HPV (హ్యూమన్ పాపిల్లోమావైరస్) వ్యాక్సిన్, న్యుమోకోక్కల్ వ్యాక్సిన్ మరియు షింగిల్స్ వంటివి AVON కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి.
డాక్టర్ విక్రమ్ వెంకటేశ్వరన్, పార్ట్నర్ హెడ్, డెలాయిట్, ఇండియా, డాక్టర్ విజయ్ యెల్దండి, ఇన్ఫెక్షియస్ డిసీజెస్, డిజార్డర్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్, ఇండియా & యుఎస్ఏ, శ్రీ రతన్ జలన్, ఫౌండర్ & మేనేజింగ్ డైరెక్టర్, మీడియం హెల్త్కేర్ కన్సల్టింగ్ మరియు డాక్టర్ ఐశ్వర్య పాతపాటి, మిస్ గ్లోబ్ ఇండియా-2023 లు AVONని ప్రారంభించటం తో పాటుగా తమ కొత్త కార్యక్రమం ద్వారా మానవాళికి సేవ చేయడంలో నిజాయితీగా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం తరువాత నివారించగల వ్యాధుల నుండి పెద్ద వయసు వ్యక్తులను రక్షించడం మరియు అడల్ట్ ఇమ్యునైజేషన్కు వున్న అడ్డంకులను తొలగించటం పై చర్చా కార్యక్రమాలు జరిగాయి.
READ MORE: Subhas Chandra Bose: నేతాజీ అవశేషాలను తీసుకురావాలి.. ప్రభుత్వాన్ని కోరిన చంద్రబోస్ మనవడు..
ఈ సందర్భంగా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సిఎండి డాక్టర్ రమేష్ కంచర్ల మాట్లాడుతూ మశూచి వ్యాక్సిన్ ద్వారా ప్రపంచంలో లక్షలాది మంది ప్రాణాలను కాపాడేందుకు కారణమైన డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ సేవలను వైద్యరంగం ఎప్పటికీ మరువదన్నారు. ఈ గ్రహం నుండి తొలగించబడిన ఏకైక వ్యాధి, మశూచి.
” ఒక సమగ్ర ప్రాజెక్ట్, నిబద్ధత మరియు అంకితభావం ద్వారా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ దేశంలో వ్యాధి భారాన్ని తగ్గించగలదని నేను భావిస్తున్నాను. వయస్సుతో పాటుగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది, అందువల్ల పెద్ద వయసు వ్యక్తులు ప్రతి సంవత్సరం టీకాలు వేయించుకోవాలి. పదే పదే ఈ విషయాన్ని నొక్కి చెప్పడం ద్వారా, ‘వ్యాక్సినేషన్లు మీ పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా అవి ప్రాణాధారాలే ‘ అని ప్రజల మనస్సుల్లో జొప్పించే ప్రయత్నం చేస్తున్నాము.
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో సామూహిక టీకా కార్యక్రమాల ద్వారా తమ సామర్థ్యాన్ని మరియు నిబద్ధతను రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రదర్శించింది. అనేక మంది శ్రేయోభిలాషులు, ఫార్మా కంపెనీలు, కార్పొరేట్లు మరియు పెద్ద ఎత్తున ప్రజలు మేము వయోజన వ్యాక్సినేషన్ ప్రాజెక్ట్ను ప్రారంభించాలని కోరుకున్నారు. అందువల్ల, ఫైజర్, సనోఫీ మరియు సీరమ్ ఇన్స్టిట్యూట్లతో కలిసి ప్రజలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడం కోసం AVONని ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది..” అని అన్నారు.
READ MORE: CM Chandrababu: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రేపు కీలక చర్చ..
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ చిర్ల మాట్లాడుతూ, “ఒక అధ్యయనం ప్రకారం, భారతీయ వయోజనుల్లో 2/3 వంతు మందికి అడల్ట్ వ్యాక్సినేషన్ గురించి తెలియదు, అందువల్ల మా కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించడం చాలా అవసరమని మేము భావిస్తున్నాము. ఇది దేశంలోని పెద్ద వయసు వ్యక్తులను శక్తివంతం చేయడంలో మాకు సహాయపడుతుంది” అని అన్నారు. అభిరుచి, నైపుణ్యం మరియు అంకితభావంతో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎల్లప్పుడూ ఉన్నత ప్రమాణాలతో కూడిన సంరక్షణను అందించడానికి కట్టుబడి ఉంటుంది.