Modi-Manu Bhakar: మను భాకర్ కు ప్రధాని ఫోన్.. ఏమన్నారంటే..?
- కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన మను భాకర్
- మనుకు ఫోన్ చేసిన ప్రధాని మోడీ
- విజయం సాధించారన్న వార్త విన్న తర్వాత ఉత్సాహంగా ఉనానన్న ప్రధాని
- మోడీకి ధన్యవాదాలు తెలిపిన మను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను భాకర్ కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళా షూటర్‌గా నిలిచింది. ఫైనల్లో మను మొత్తం 221.7 పాయింట్లు సాధించింది. ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. షూటర్ మను భాకర్‌కు అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రధాని మోడీ ఆమెకు ఫోన్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మనుతో ఫోన్‌లో మాట్లాడారు. ఆమెకు అభినందనలు తెలిపారు. టోక్సో ఒలింపిక్స్ గురించి ప్రస్తావన వచ్చింది.
READ MORE: Prashant Kishor: రాజకీయ పార్టీ పెడుతున్న ప్రశాంత్ కిషోర్ .. ‘జన్ సురాజ్ పార్టీ’గా పేరు..
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
“మను మీకు శుభాకాంక్షలు. మీరు విజయం సాధించారన్న వార్త విన్న తర్వాత ఉత్సాహం, ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను. రజతం చేజారినప్పటికీ.. మీరు మన దేశం పేరును నిలబెట్టారు. మీకు రెండు విధాలా క్రెడిట్ దక్కుతుంది. ఒకటి కాంస్యం సాధించడం అయితే.. రెండు.. ఈ విభాగంలో పతకం తీసుకొచ్చిన తొలి మహిళగా రికార్డు సృష్టించడం. టోక్యో ఒలింపిక్స్ సమయంలో మీకు పిస్టల్ లో లోపం సంభవించింది. అప్పటి లోపాన్ని ఇప్పుడు కవర్ చేశారు. నాకు మీపై పూర్తి నమ్మకం ఉంది. ప్రారంభమే చాలా బాగుంది. మీరు తప్పకుండా పతకం సాధిస్తారనుకున్నాను.” అని మోడీ మాట్లాడారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారా అని మనుని అడిగారు మోడీ. తన నాన్న రామ్‌కిషన్ చాలా సంతోషిస్తుంటారని..తనని చాలా ప్రోత్సహించారన్నారు. తోటి క్రీడాకారులు అందరూ సౌకర్యంగానే ఉన్నారా? అక్కడ అన్ని ఏర్పాట్లు సరిగ్గానే ఉన్నాయా? అని అడిగారు. మన క్రీడాకారులకు అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు.
READ MORE:Gujarat: పెళ్లైన ఏడాదికి బయటపడ్డ భార్య సీక్రెట్.. డాక్టర్ వద్దకు వెళ్లడంతో తెలిసిన నిజం..
ఈ సందర్భంగా మను మాట్లాడుతూ.. మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ” మన క్రీడాకారులు ఇక్కడ రాణిస్తున్నారు. నాకు భవిష్యత్తులో ఇంకా మ్యాచ్‌లు ఉన్నాయి. వాటిలో రాణిస్తా. క్రీడాకారులందరూ ఇక్కడ ఆనందంగా ఉన్నారు. మిమ్మల్ని కూడా గుర్తు చేస్తున్నారు. మీ ప్రయత్నాలు ఫలించాయి.” అని సమాధానమిచ్చింది.
తాజావార్తలు
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!