జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 30 ఏళ్ల తర్వాత చారిత్రక ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ముర్రాన్ గ్రామంలో తెరిచిన ఈ బరారీ మౌజ్ ఆలయంలో కాశ్మీరీ పండిట్లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ముర్రాన్ గ్రామానికి చెందిన పండితులు, ముస్లిం ప్రజలు కలిసి ఆలయ తలుపులు తెరిచారు.
ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. ప్రధానితో పాటు 72 మంది మంత్రులు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈసారి ప్రధాని మోడీ టీమ్‌లో చాలా మంది పాత ముఖాలకు మళ్లీ అవకాశం దక్కింది. మరి మోడీ ప్రభుత్వంలోని మంత్రులు ఎంత విద్యావంతులుగా ఉన్నారో తెలుసుకుందాం. పీహెచ్డీ పూర్తి చేసిన వారిలో మొత్తం 7 మంది మంత్రులు ఉన్నారు. ముగ్గురు మంత్రులు ఎంబీఏ చదివారు. ప్రధాని […]
మోడీ 3.0లో ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణపై దృష్టి పెట్టవచ్చని పలువురు అభిప్రాయ పడ్డారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ వ్యూహం కాస్త మారినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం గత హయాంలో చమురు కంపెనీ పెట్టుబడుల ఉపసంహరణలో బిజీగా ఉంది.
వాతావరణం మారుతోంది. వర్షాలు ప్రారంభమయ్యాయి. సీజనల్ వ్యాధులు ప్రబలే ఈ కాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పొత్తికడుపు ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలతో పిల్లలు ఈ కాలంలో చాలా ఇబ్బందిపడతారు. ఈ వర్షాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అనుసరించాల్సిన పరిశుభ్రత, జాగ్రత్తల గురించి పెద్దలకు కచ్చితమైన అవగాహన ఉండాలి. పాఠశాలలు మెుదలయ్యే రోజు దగ్గరకు వచ్చింది. చాలా మంది వర్షం పడితే గెంతుతూ సంబరాలు చేసుకుంటారు. దీంతో […]
ప్రముఖ ల్యాప్ టాప్ కంపెనీ ఏసర్(Acer).. ALG గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా గేమింగ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ ల్యాప్ టాప్ ను లాంచ్ చేసింది. ఇది 16 GB వరకు DDR4 RAM, Nvidia GeForce RTX 3050 GPUతో 12వ జెనరేషన్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది.
బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా సరిహద్దులు దాటి భారత్‌లోకి చొరబడుతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ముంబై నుంచి షాకింగ్ విషయం బహిర్గతమైంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన నలుగురు యువకులు ఇక్కడ నివసించడమే కాకుండా.. వారు చట్టవిరుద్ధంగా భారత పౌరులుగా మారడానికి పత్రాలను కూడా పొందారు.
ఒడిశా తదుపరి ముఖ్యమంత్రిని భాజపా ఖరారు చేసింది. మోహన్ మాంఝీని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేవీ సింగ్ డియో, ప్రవతి పరిదాను ఉప ముఖ్య మంత్రులుగా ఖరారు చేసింది. ఒడిశాలోని కియోంజర్ నియోజకవర్గం నుంచి మోహన్ మాఝీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.
మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు చెందిన ప్రముఖ నాయకుడు, 8 సార్లు ఎంపీగా గెలిచిన వీరేంద్ర కుమార్ ఖాటిక్ మోడీ 3.0 కేబినెట్లో మంత్రి అయ్యారు. ఖాటిక్ టికామ్‌గఢ్ నుంచి ఎంపీగా గెలుపొందారు.
పంటి నొప్పికి దంతాలు లేదా చిగుళ్లు కారణమవుతాయి. మీకు పంటి నొప్పి ఉంటే.. ఈ రెండింటిలో ఆ సమస్యకు మూలం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. అప్పుడు మాత్రమే నొప్పి నుంచి ఎలా ఉపశమనం పొందాలో నిర్ణయించుకోవచ్చు.
ఓ షాప్ యజమాని రూ. 300 విలువైన నకిలీ ఆభరణాలను రూ. 6 కోట్లకు విక్రయించాడు. అది కూడా ఓ అమెరికన్ మహిళకు అమ్మెశాడు. విషయం తెలుసుకున్న మహిళ యజమానిపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం యజమాని పరారీలో ఉన్నాడు.