Sonam wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్సకు సోనమ్ వాంగ్‌చుక్ నిరాకరణ.
- డీహైడ్రేషన్, పొటాషియం లోపం, పెరిగిన కీటోన్ స్థాయిలు గుర్తించిన వైద్యులు.
- IV ఫ్లూయిడ్స్, ORS ఇవ్వాలని సూచించినా అంగీకరించని వాంగ్‌చుక్.
- ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న వైద్య బృందం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonam wangchuk: జంతర్ మంతర్ వద్ద 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను శనివారం ఉదయం పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అయితే, వైద్యుల చికిత్సకు ఆయన నికారిస్తున్నట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది. వాంగ్‌చుక్ డీహైడ్రేషన్, సీరం పొటాషియం లోపం, కాంపెన్సెడెట్ అసిడోసిన్, కీటోన్ స్థాయిలు పెరిగినట్లు పరీక్షల్లో తేలింది. ఉదయం ఆయన మూత్రంతో కీటోన్ స్థాయి 1+గా ఉండగా, మధ్యాహ్నానికి ఇది 3కి పైగా పెరిగిందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేర్చే సమయానికి, అతను పూర్తి స్పృహలో ఉన్నాడు, రక్తపోటు, నాడి, ఆక్సిజన్ సాచురేషన్ లెవల్స్ సాధారణంగా ఉన్నాయని చెప్పారు. షుగర్ 78 mg/dlగా ఉన్నట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.
సోనమ్ వాంగ్చుక్కు ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్, ఇతర మందులు ఇవ్వాలని వైద్యులు సూచించినప్పటికీ ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకోవడానికి అంగీకరించడం లేదని ఆస్పత్రి పేర్కొంది. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. దీర్ఘకాలిక నిరాహార దీక్షలో కీటోన్ స్థాయిలు పెరగడం సాధారమే అయినా, డీహైడ్రేషన్‌తో ఇది కొనసాగితే కిడ్నీలపై ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే శరీర జీవక్రియపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జే. ఆంగ్మో సఫ్ధర్‌జంగ్ ఆస్పత్రికి లేఖ రాశారు. తమ అనుమతి లేకుండా ఆయనకు ఎలాంటి మందులు, ద్రవాలు ఇవ్వొద్దని కోరారు. ఆయనను మరో ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఇదే డిమాండ్ చేస్తోంది. జూలై 20న వీరు ‘‘పార్లమెంట్ మార్చ్’’కు పిలుపునిచ్చారు. జూన్ 28 నుంచి నిరాహార దీక్షలో ఉన్న వాంగ్‌చుక్ ఇప్పటి వరకు సుమారు 9.5 కిలోల బరువు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!