Srisailam: శ్రీశైలంలో అన్య మతస్థులకు షాపులపై సుప్రీంకోర్టు తీర్పు..
- శ్రీశైలంలో అన్య మతస్థులకు షాపులు
- షాపులు కేటాయించ వద్దని గతంలో 425 జీవో
- ఈ జీవోపై ఇప్పటి వరకు రెండు సార్లు స్టే విధించిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీశైలంలో అన్య మతస్థులకు షాపులు కేటాయించ వద్దన్న జీవో నెంబర్ 425పై స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రీశైలం దేవస్థానం ప్రాంతంలో అన్య మతస్థులకు దుకాణాలు కేటాయించ వద్దని 2015లో ప్రభుత్వం జీవో 425 జారీ చేసిన విషయం తెలిసిందే. జీవో 425 ను సవాల్ చేస్తూ పలువురు దుకాణదారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు 2020లో జీవోపై స్టే విధించింది. స్టే విధించినప్పటికీ ప్రభుత్వం మళ్లీ టెండర్లను పిలిచింది. దాంతో పలువురు దుకాణదారులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
READ MORE: Rajamouli – Rashmi: రష్మితో రాజమౌళి ఫ్లర్టింగ్.. వీడియో చూశారా?
Also Read
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
- T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
దుకాణాల వేలం టెండర్లను పొరపాటున జారీ చేశామని, ప్రస్తుతం వాటిని ఉపసంహరించుకున్నామని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ అంశంపై స్థానిక అధికారులకు అయోమయం లేకుండా తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఒకా, జస్టిస్ ఉజ్జన్ భూయల్ ధర్మసనం.. జీవో 425 అమలు చేయొద్దని మరోసారి స్పష్టంగా వెల్లడించింది.
READ MORE: CM Chandrababu: కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ.. మిర్చి రైతులను ఆదుకోండి..
శ్రీశైలంలో అన్యమతస్తులకు షాపులు కేటాయించడంపై హిందూ ధార్మిక సంస్థలు గతంలో తీవ్ర అభ్యంతరం తెలిపాయి. అలాగే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ సంఘటనపై స్పందిస్తూ వెంటనే అన్యమతస్తుల షాపులు తొలగించాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఇక్కడి దుకాణాల వేలం పాటలో ఇతర మతస్థులు పాల్గొననవద్దని బీజేపీతో సహా ఇతర పార్టీలు వేలంను అడ్డుకున్నాయి. దీంతో అప్పుడు వేలం పాటను నిలిపివేశారు. అయితే వివాదం రాజుకున్న తరువాత ఆలయ ఈవోను బదిలీ చేశారు. అనంతరం అన్య మతస్థులకు దుఖానాలు షాపులు కేటాయించ వద్దని ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఈ జీవోపై సుప్రీంకోర్టు రెండు సార్లు స్టే విధించింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..