సాంబారును మొట్టమొదటిసారిగా ఎక్కడ తయారైంది అనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. తంజావూరును పాలించిన మరాఠీ పాలకుల వంటశాలలో తయారు చేశారనే సమాధానం వినిపిస్తుంది. ఛత్రపతి శివాజీ సవతి తమ్ముడు వ్యాంకోజీ తంజావూరును పాలించాడు. ఆయన 1683లో మృతి చెందాడు. వ్యాంకోజీ కుమారుడు షాహాజీ భోంస్లే. ఆయన మరణానంతరం 1684లో షాహాజీ సింహాసనాన్ని అధిష్టించాడు. అప్పటికీ ఆయనకు పన్నెండేళ్లు. సాహిత్యం, కళలపై షాహాజీకి అపార ఆసక్తి ఉండేది. వంటలు కూడా బాగా చేసేవారట. ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు, శంభాజీ తంజావూరును సందర్శించినప్పుడు అతని కోసం ప్రత్యేకంగా సాంబార్ అనే వంటకాన్ని తొలిసారి వండినట్టు చెబుతారు.
ఛత్రపతి శివాజీ తనయుడు.. శంభాజీ మహారాజ్ ఒకసారి తంజావూరు వెళ్లారు. అప్పట్లో పులుపు కోసం రేగు పళ్లు వాడేవారట. శంబాజీ కోసం చేసే కూరల్లో రుచి కోసం వాడే రేగు పళ్లు లేకపోవడంతో చింతపండును వాడారట. ఆ వాసన అతనికి బాగా నచ్చింది. అతడికి ఈ సాంబారును తొలిసారి వడ్డించినట్టు చరిత్ర చెబుతోంది. అయితే.. శంభాజీని ముద్దుగా సాంబా అని పిలుచుకుంటారు. ఈ కొత్త వంటకానికి అతని గౌరవార్థం అతని పేరునే పెట్టారు. శంభాజీ + ఆహార్ అని కలిసివచ్చేలా ఆ వంటకానికి “సాంబారు” అని పేరు పెట్టారని చరిత్ర చెబుతోంది. అదే వంటకం అనేక మార్పులతో దక్షిణ భారతదేశంలో మాత్రమే కాకుండా భారతదేశమంతా పాకింది. ఇది సాంబారు గురించి వినిపించే ఒక కథ. ఈ కథను ప్రముఖ ఫుడ్ హిస్టోరియన్, డైట్ నిపుణులు కేటి ఆచార్య ధ్రువీకరించారు. సాంబారు తంజావూరులోనే పుట్టిందని అందరూ నమ్ముతున్నారు. రానున్న క్రమంలో ఈ కథను పలువురు విమర్శిస్తూ ప్రశ్నలు సైతం లేవనెత్తారు. కానీ.. హిందు సమాజం మాత్రం ఈ స్టోరీని విశ్వసిస్తోంది.
READ MORE: Karnataka: నా ఫ్రెండ్తో నా వైఫ్ లేచిపోయింది.. సూసైడ్ చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడి