Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran Abbavaram: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాపై ధీమా వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని తెలిపారు. ‘చెన్నై లవ్ స్టోరీ’లో ఓ ప్రత్యేకమైన లైఫ్ ఉందని కిరణ్ అన్నారు. ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గుండె నిండిపోయిన అనుభూతితో వస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కనెక్ట్ అవుతాయని తెలిపారు.
ఇక సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, మీమ్స్‌పై కూడా కిరణ్ ఈ ఇంటర్వ్యూలో స్పందించారు. ఎవరైనా మనపై కామెంట్స్ చేసినప్పుడు వెంటనే ఆవేశంతో స్పందించకూడదని అన్నారు. వారి అభిప్రాయం వెనుక ఉన్న ఆలోచనను అర్థం చేసుకుని విశ్లేషించుకోవాలని సూచించారు. ప్రతి కామెంట్‌కు సమాధానం ఇవ్వడం కంటే మన పనిపై మనం దృష్టి పెట్టడం ముఖ్యమని అన్నారు. తన ఐదేళ్ల సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. ఈ టైంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. విజయాలు, ప్రశంసలు, వరుస హిట్స్ అన్నీ చూశానని, ఈ ప్రయాణం తనకు ఎన్నో విషయాలు నేర్పిందని అన్నారు. తన కుమారుడు భవిష్యత్‌లో తనను ఎలా గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నారనే ప్రశ్నకు కిరణ్ ఆసక్తికరంగా స్పందించారు. “మా నాన్న మంచోడు రా అని నా కొడుకు చెప్పుకుంటే చాలు. గొప్పవాడిగా గుర్తుండాలని కాదు.. మంచి మనిషిగా గుర్తుండాలని కోరుకుంటాను” అని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!