-
CM Chandrababu : దళితుల కోసం మంచి స్కీంను తీసుకొస్తాం..
దళితుల కోసం యుద్ధం చేసిన యోధుడు అంబేద్కర్ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ రోజు మన అందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ అన్నారు.. 2003లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశామని.. చదువుకోవాలనే ఆశ ఉండే పిల్లలందరినీ చదివిస్తామని హామీ ఇచ్చారు. తొందర్లోనే మంచి స్కీంను తీసుకొస్తామని తెలిపారు. అమరావతికి దేశంలోని మంచి కాలేజీలు వస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 21… -
Srikakulam: నాలుగు గుళ్లపై అన్యమత సూక్తులు, గుర్తులు.. ఎస్పీ ఏమన్నారంటే?
శ్రీకాకుళం జిల్లా జలుమూరులో గుడి గోడలపై అన్యమత ప్రచార రాతలకు సంబంధించి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. జలుమూరు మండలంలో నాలుగు గుళ్ల పైన అన్యమత సూక్తులు, గుర్తులు రాశారని.. టెక్నికల్ టీమ్స్ తో పాటు తొమ్మిది బృందాలును ఏర్పాటు చేసి ఎంక్వయిరీ చేశామన్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముగ్గురు నిందితులు పగోటి ఈశ్వరరావు (బుడితి గ్రామం), మామిడి అజయ్ (కాకినాడ జిల్లా), చందక దేవుడు నాయుడు (బుడితి గ్రామం) అని తెలిపారు. చందక దేవుడు బుడితిలో పాస్టర్… -
Visakhapatnam: గర్భిణీ హత్య కేసులో కీలక విషయాలు తెలిపిన స్నేహితులు…
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. 24 గంటలలో డెలివరీ కావలసిన భార్యను గొంతు నులిమి చంపేశాడు భర్త. మనస్పర్థలు కారణంగా భార్య అనూషకు భర్త జ్ఞానేశ్వర్ మధ్య గొడవ తలెత్తింది. రెండు ఏళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అంతలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా.. ఈ అంశంపై తాజాగా ఆమె స్నేహితుడు కీలక విషయాలు వెల్లడించారు. రెండేళ్ల క్రితం సింహాచలంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పారు. మృతురాలు అనూష తండ్రి చనిపోయారు, తల్లికి ఆరోగ్యం బాగోలేక మూడేళ్లగా కోమాలో ఉందన్నారు. -
Chittoor: ప్రేమ పెళ్లి.. తండ్రికి సీరియస్గా ఉందని పుట్టింటికి వెళ్లి అనంతలోకాలకు వివాహిత
చిత్తూరులో వివాహిత అనుమానాస్పద మృతి చోటు చేసుకుంది. పరువు హత్య కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. చిత్తూరుకు చెందిన యాస్మిన్ భాను 3 నెలల క్రితం పూతలపట్టు మండలానికి చెందిన సాయి తేజను ప్రేమ పెళ్లి చేసుకుంది. యాస్మిన్ భాను, సాయితేజ్ గత ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. అదే నెల 13న తిరుపతి రూరల్ పోలీసులను ప్రేమజంట ఆశ్రయించింది. ఇద్దరూ మేజర్లు కావడంతో యాస్మిన్ భాను తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. యువతిని సాయితేజ వెంట పంపించారు. -
PM Modi: HCU భూముల వ్యవహారంపై తొలిసారిగా స్పందించిన ప్రధాని
హర్యానా యమునా నగర్ ర్యాలీలో మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేసిన మోడీ.. తెలంగాణ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని మోడీ అన్నారు. అలాగే.. హెచ్సీయూ కంచ గచ్చిబౌలి భూములపై తొలిసారిగా స్పందిస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములను నాశనం చేస్తుందని విమర్శించారు. -
Visakhapatnam: 24 గంటలలో డెలివరీ కావలసిన గర్భిణిని.. దారుణంగా చంపిన భర్త
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. 24 గంటలలో డెలివరీ కావలసిన భార్యను గొంతు నులిమి చంపేశాడు భర్త. మనస్పర్థలు కారణంగా భార్య అనూషకు భర్త జ్ఞానేశ్వర్ మధ్య గొడవ తలెత్తింది. రెండు ఏళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. పీఎం పాలెం ఉడా కాలనీలో నివాసం ఉంటున్నారు. భర్త జ్ఞానేశ్వర్ స్కౌట్స్, సాగర్ నగర్ వ్యూ పాయింట్ వద్ద రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తున్నాడు. ఈరోజు ఉదయం అనూషకు ఆరోగ్యం బాగో లేదంటూ స్నేహితులకు సమాచారం ఇచ్చాడు జ్ఞానేశ్వర్. -
Kishan Reddy: దేశం కోసం సిక్కులు చేసిన త్యాగం వెలకట్టలేనిది
దేశం, ధర్మం కోసం త్యాగం చేసిన సమాజంగా సిక్కుల సమాజం గుర్తింపు పొందిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. వారి త్యాగం వెలకట్టలేనిదన్నారు. ఆదివారం బైశాఖి దినోత్సవం సందర్భంగా అమీర్ పేట్ లోని సిక్కు సోదరుల పవిత్ర ప్రార్థన మందిరాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. అనేక సంవత్సరాలుగా అమీర్ పేట్ లోని ఈ గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటుందన్నారు. ప్రధాని మోడీ కూడా గతంలో ఈ… -
Rajagopal Reddy: “మంత్రి పదవి ఇవ్వాల్సిందే”.. నా మంచితనాన్ని చేతగానితనం అనుకోవద్దు..
తాను మంత్రి పదవి కోసం ఢిల్లీలో పైరవీలు చేయనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. ఖమ్మంలో 9 మంది గేలిస్తే 3 మంత్రి పదవులు వచ్చాయని తెలిపారు. మరి నల్లగొండలో 11 స్థానాలు గెలుస్తే మంత్రి పదవులు రెండేనా? అన్నారు. -
Heavy Rains: జనగామ, ఖమ్మం జిల్లాలో వర్ష బీభత్సం.. భారీగా పంటనష్టం
జనగామ జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో భారీ వడగండ్ల వాన కురిసింది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. కొంత ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. జనగామ ,లింగాల గణపురం, రఘునాథపల్లి మండలాల్లో కురిసిన వర్షానికి పంట నేలరాలింది. పలుచోట్ల రహదారులపై చెట్లు నేలకొరిగాయి. -
Hyderabad : ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి వాహన దారుడు బలి..
బాలనగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి వాహన దారుడు మృతి చెందాడు. చలానా రాసేందుకు రన్నింగ్ లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆపే క్రమంలో ద్విచక్రవాహన దారుడు అదుపుతప్పి కింద పడ్డ పడ్డాడు. ఆ వ్యక్తి తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అని రోడ్డుపై ఇతర వాహన దారులు ధర్నాకు దిగారు. దీంతో బాల నగర్ నుంచి నర్సాపూర్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్…
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా. పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలశ్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!