-
Hyderabad: నగరంలో మరో లిఫ్ట్ ప్రమాదం.. ఆర్ఎంపీ డాక్టర్ మృతి
హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో అపార్ట్మెంట్లో లిప్టు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలుడు అక్బర్ (10)మృతి చెందాడు. బంతితో ఆడుతూ బంతి లిఫ్ట్ గోతిలో పడడంతో తీయడానికి వెళ్లాడు అక్బర్ పటేల్. అదే సమయంలో లిఫ్ట్ వెయిట్ తలపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. -
TG NEWS: ఏప్రిల్ 14 నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు!
తెలంగాణ ఏప్రిల్ 14 (సోమవారం) నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉందని నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. సచివాలయంలో జరిగిన ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్-కమిటీ తుది సమావేశానికి అధ్యక్షత వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, చట్టం యొక్క విధి విధానాలను వివరించే ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) అంబేద్కర్ జయంతి నాడు జారీ చేయబడుతుందని అన్నారు. జీఓ యొక్క మొదటి కాపీని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి అందజేయనున్నారు. -
Health Tips: బాత్రూం కంటే బెడ్రూంలోనే డేంజర్ బ్యార్టీరియా
బాత్రూంలో ఎంత బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు ఉంటాయో అందరికీ తెలుసు. కంటికి కనిపించని సుక్షజీవులు చాలా ఉండాయి. అందుకే బాత్రూంని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే అంతకంటే ఎక్కువ స్థాయిలో బ్యాక్టీరియా ఉండే చోటు ఒకటి ఉంది. అదే మీ బెడ్రూమ్. ఏంటి అవాక్కయ్యారా? ఇది అక్షరాల నిజం. బెడ్రూంలో నిత్యం వాడే దిండ్లపై బాత్రూంలో కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంధ సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. -
Kadapa: క్రికెట్ బెట్టింగ్ భూతానికి బిటెక్ విద్యార్థి బలి..
క్రికెట్ బెట్టింగ్ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. డబ్బులు అధికంగా వస్తాయన్న ఆశతో బెట్టింగ్‌లో పాల్గొన్న యువకుడు చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన కడప జిల్లా బుద్వేల్‌లో విషాదాన్ని నెలకొల్పింది. బుద్వేల్‌కు చెందిన పవన్ కుమార్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగ్‌కు లోనయ్యాడు. మొదట్లో స్వల్ప లాభాలు రావడంతో ఆశ పెరిగింది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో అంటే సుమారు 80 వేలు బెట్టింగ్ పెట్టాడు. అయితే.. పెట్టిన మొత్తాన్ని నష్టపోయిన పవన్ తీవ్ర… -
RR vs RCB : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. 2023 సీన్ రిపీట్ అవుతుందా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-28లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు జట్టుకు రజత్ పటిదార్ నాయకత్వం వహిస్తుండగా.. రాజస్థాన్ కెప్టెన్‌గా సంజు శాంసన్ ఉన్నాడు. -
UP CM Yogi Adityanath: వక్ఫ్ చట్టం పేరుతో హింసను ప్రేరేపిస్తున్నారు..
లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వక్ఫ్ చట్టంపై పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన హింసను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్షాలు హింసను ప్రేరేపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ముగ్గురు హిందువులను వారి ఇంటి నుంచి బయటకు లాగి దారుణంగా హత్య చేశారన్నారు. లక్నోలో బాబా సాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సమ్మాన్ అభియాన్ కింద నిర్వహించిన రాష్ట్ర వర్క్‌షాప్‌లో బీజేపీ నాయకులను ఉద్దేశించి సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. -
Atishi: ఢిల్లీ సీఎం రేఖాగుప్తా భర్త ప్రభుత్వాన్ని నడుపుతున్నారు!
ఢిల్లీ సీఎం రేఖాగుప్తా భర్తపై మాజీ ముఖ్యమంత్రి అతిశీ సంచలన ఆరోపణలు చేశారు. రేఖాగుప్తా భర్త మనీష్ గుప్తా అనధికారంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. పలువురు అధికారులతో మనీష్ గుప్తా సమావేశమైన ఫొటోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. -
Annamayya District: 78 మందితో ఇంటర్ కాలేజీ ప్రారంభం.. ఫస్ట్ ఇయర్లో ఒక్కరే పాస్!
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండల కేంద్రంలో 78 మందితో నూతనంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రారంభమైంది. ఇటీవల నిర్వహించిన మొదటి సంవత్సరం పరీక్షలు అందరూ రాశాడు. తాజాగా ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కాగా.. ఈ 78 మంది విద్యార్థుల్లో ఒక్కరు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పాసైన విద్యార్థిని ఆనందల మల్లికకు 294 మార్కులు వచ్చాయి. మిగతా 77 మంది విద్యార్థిని విద్యార్థులు ఫెయిలయ్యారు. జూనియర్ కాలేజీ లో ప్రిన్సిపాల్, లెక్చలర్లు లేకపోవడంతో ఉత్తీర్ణశాతం పూర్తిగా దెబ్బతింది. -
SRH vs PBKS: దంచి కొట్టిన పంజాబ్ బ్యాటర్స్.. ఎస్ఆర్హెచ్ ముందు భారీ లక్ష్యం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-27లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పంజాబ్ కింగ్స్ (PBKS)తో తలపడుతోంది. ఈ రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది. పంజాబ్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవాలంటే 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. -
Murder: తల్లే హంతకురాలు.. లిఖిత హత్య కేసును ఛేదించిన పోలీసులు..
నరసింగాపురం లిఖిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తమ కులానికి చెందినవాడిని కాకుండా మరో కులానికి చెందిన యువకుడితో లిఖిత వెళ్లిపోతుందన్న అనుమానంతో, పరువు పోతుందని భయంతో తల్లి సుజాత తన కుమార్తెను హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా. పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలశ్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!