US-India: అమెరికాలో వడ్డీరేట్ల కోత భారతీయ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
- వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించిన అమెరికా ఫెడరల్ రిజర్వ్
- ద్రవ్యోల్బణం ఇప్పుడు నియంత్రణలోకి వస్తుందని అభిప్రాయం
- ఇతర దేశాల వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసాన్ని పెంచే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా ఫెడరల్ రిజర్వ్ గురువారం వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించింది. 2024లో వడ్డీ రేట్లు తగ్గించడం ఇది రెండోసారి. ద్రవ్యోల్బణం ఇప్పుడు నియంత్రణలోకి వస్తుందని ఫెడ్ అభిప్రాయపడింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై 48 గంటలు కూడా గడవని తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ఎకనామిక్ డేటాపై నిఘా ఉంచుతుందని యుఎస్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ చెప్పారు. డిసెంబర్‌లో జరిగే తదుపరి సమావేశంలో, 2024లో వడ్డీ రేట్లలో తుది కోత పెట్టాలా వద్దా అని ఫెడ్ నిర్ణయిస్తుంది. అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందా..
భారత్‌పై ప్రభావం..
వడ్డీ రేట్ల తగ్గింపు అమెరికా, ఇతర దేశాల వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసాన్ని పెంచవచ్చు. దీని కారణంగా.. కరెన్సీ క్యారీ ట్రేడ్ పరంగా భారతదేశం వంటి దేశాలు మరింత ఆకర్షణీయంగా మారవచ్చు. యూఎస్ వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే, మధ్యవర్తిత్వానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇతర దేశాలలో కూడా వడ్డీ రేట్ల తగ్గింపు దశ ప్రారంభమయ్యే వరకు ఇది కొనసాగుతుంది. వడ్డీరేట్లను తగ్గించాలన్న ఫెడ్ సంకేతం అమెరికాలో వృద్ధికి ఊతం ఇస్తుంది. ప్రపంచ వృద్ధికి ఇది శుభవార్త కావచ్చు. యూఎస్ డెట్ మార్కెట్లలో తక్కువ రాబడులు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ స్టాక్‌లలో అస్థిరతకు దారితీయవచ్చు. దీంతో విదేశీ ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగే అవకాశం ఉంది.
Also Read
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
కరెన్సీ మార్కెట్‌పై దీని ప్రభావం..
ఇది నిధుల ప్రవాహం కారణంగా కరెన్సీ మార్కెట్లపై కూడా ప్రభావం చూపవచ్చు. ఆర్‌బీఐ చివరిసారిగా మే 2020లో రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించి 4%కి కుదించింది. అప్పుడు కరోనా మహమ్మారి కారణంగా డిమాండ్ తగ్గింది. ఉత్పత్తి కోతలు, ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. అనియంత్రిత ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు ఆర్‌బీఐ రెపో రేటును 2.5 శాతం పెంచి 6.5 శాతానికి చేర్చింది. ద్రవ్యోల్బణం రేటును 4% వద్ద ఉంచాలని సెంట్రల్ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం 2% పైకి లేదా క్రిందికి వెళ్ళే స్వేచ్ఛను కలిగి ఉంది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తదుపరి సమావేశం డిసెంబర్ 4-6 తేదీల్లో జరగనుంది.
జపాన్ నిర్ణయంతో భారత్ అవస్థ..
బ్యాంక్ ఆఫ్ జపాన్ (BoJ) వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు భారతీయ మార్కెట్లను ప్రభావితం చేసే రెండవ ప్రధాన బాహ్య అంశం. ఇది యెన్ క్యారీ-ట్రేడ్ సమీకరణాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ సంవత్సరం ఆగస్టులో, BoJ రేట్లు 0.1% నుంచి 0.25%కి పెంచినప్పుడు.. అది యెన్ క్యారీ ట్రేడ్ పొజిషన్ల లిక్విడేషన్‌కు దారితీసింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు పతనమయ్యాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ తన డిసెంబర్ (18-19) సమావేశంలో రేట్లు పెంచుతుందని భావిస్తున్నారు. కారణం అమెరికాలో కొత్త పరిపాలనకు సంబంధించి అనిశ్చితి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. యెన్‌లో క్షీణత, ఇప్పుడు జరుగుతున్నట్లుగా, రేట్లు పెంచడానికి BoJని ప్రేరేపించవచ్చు.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!