Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ విషాదం చోటుచేసుకుంది. అభ్యర్థిగా పోటీలో ఉన్న 40 ఏళ్ల మహమ్మద్ అన్వర్ గుండెపోటుకు గురై మరణించారు. ఎర్రగడ్డలో నివాసి అన్వర్ కౌంటింగ్ ప్రక్రియపై ఉత్కంఠ ఎదురు చూస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఛాతి నొప్పితో కుప్పకూలినట్లు తెలుస్తోంది. కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మరణించారని వైద్యులు ధృవీకరించారు.
Nitish Kumar: బీహార్ ఎన్నికల ఫలితాలు వెలుడనున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. నవంబర్ 6న మొదటి దశ పోలింగ్ జరిగింది. ఇందులో 65 శాతం ఓటర్లు ఓటు వేశారు. నవంబర్ 11న జరిగిన రెండవ దశ పోలింగ్‌లో దాదాపు 69 శాతం ఓటర్లు ఓటు వేశారు. ఇప్పుడు నితీష్ కుమార్ తిరిగి అధికారంలోకి వస్తారా లేదా తేజస్వి యాదవ్ కల నెరవేరుతుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. నితీష్ 20 సంవత్సరాలుగా బీహార్…
Jubilee Hills Bypoll Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యూసఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీ భద్రత మధ్య కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో, 42 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్‌కు ప్రత్యేకంగా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ పనుల్లో 186 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
Bihar Assembly Election Results: నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రెండు విడతల్లో ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత EVMల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు దృష్ట్యా, అన్ని జిల్లాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషన్ సైతం అవసరమైన అన్ని సన్నాహాలు చేసింది.
Bunny Vasu: "అందరికి విజయ్ దేవరకొండ, మాకు మాత్రం బంగారు కొండ" అంటూ నిర్మాత బన్నీ వాస్ విజయ్ ను ది గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్ లో ప్రశంసించారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో నవంబర్ 7వ తేదీన ప్రేక్షకులు ముందుకు వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం మంచి విజయం సాధించడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ పెట్టడంతో ఆ మీట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన నటుడు విజయ్ దేవరకొండను నిర్మాత బన్నీ వాస్ పొగడ్తలతో ముంచెత్తారు.
KA Paul: పీపీపీ మోడల్‌ను వ్యతిరేకిస్తూ ఒక పిల్ వేశానని.. హైకోర్టు ఒపీనియన్ తీసుకుని రావాలని సుప్రీంకోర్టు చెప్పిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. నిన్న హైకోర్టులో ఛీఫ్ జస్టిస్ విచారణ జరిపారని తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. PPP బదులుగా PPB (బిలియనీర్ల ప్రోగ్రామ్) అనాలన్నారు. మెడికల్ కాలేజీలను కొనేది నారాయణ కావచ్చు, ఎవరైనా కావచ్చు వదిలిపెట్టనని హెచ్చరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నా..
Delhi Bomb Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశ రాజధానిలో జరిగిన ఈ భయంకరమైన పేలుడులో కనీసం 12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై అస్సాంలో మాత్రం కొంత మంది మూర్ఖులు అనుచితంగా పోస్టులు పెడుతున్నారు. ఈ అంశంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఫైర్ అయ్యారు. ఈ అవమానకర పోస్టులు చేసిన రాష్ట్రవ్యాప్తంగా 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఉదయం…
Minister Ponnam Prabhakar: మహాలక్ష్మీ పథకం వచ్చిన తర్వాత సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి నెల వారిగా వస్తున్న మహాలక్ష్మి టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై దృష్టి సాధించాలని సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సిబ్బందికి సూచించారు. తాజాగా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్టీసీ లో ఇప్పటి వరకు మహిళలాలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని తెలిపారు.
Moringa: మునగ చెట్టును ఔషధ గుణాల ఖజానాగా నిపుణులు పేర్కొంటారు. ఈ చెట్టులోని ప్రతి భాగమూ విశేషమైనదే. మునక్కాయలు, ఆకులు, పువ్వులు, వేర్లు అన్నీ మన ఆరోగ్యానికి మేలుచేసే అనేక పోషకాలు, ఔషధ గుణాలతో నిండిపోయి ఉంటాయి. ముఖ్యంగా మునగాకు పోషక విలువలతో పాటు ఔషధ గుణాలను కలిగి ఉండటంతో ఆకు కూరల్లో అత్యుత్తమమైనదిగా పరిగణించబడుతుంది. మునగాకులో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటంతో శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.
Jubilee Hills By-Election Result 2025: రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.. 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు తేలనున్నాయి..