ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన పాలసీపై ముఖ్యమంత్రికి వివరించారు.
ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2014 లో బీజేపీ సభ్యత్వ సేకరణ తర్వాత 2024 లో చేస్తున్నామన్నారు.
మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వివాదంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పరకాలలో కార్యకర్తల అత్యుత్సాహం వల్లే ఇద్దరి మధ్య వివాదం చెలరేగిందన్నారు.
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ లో నూతనంగా ఏర్పాటు అవుతున్న ఫాక్స్ కాన్ కంపెనీ పనులను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
భారత్ భద్రత కోసం తాజాగా పెద్ద అడుగు వేసింది. రెండు కొత్త అణు జలాంతర్గాముల నిర్మాణానికి భారత్ ఆమోదం తెలిపింది. ప్రధాని నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ రెండు స్వదేశీ అణు జలాంతర్గాములను నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది.
శ్రీలంకలో ప్రారంభించనున్న గౌతమ్ అదానీ ప్రాజెక్టుపై గందరగోళంలో చిక్కుకుంది. 440 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 3700 కోట్లు) ఈ ప్రాజెక్ట్ పవన విద్యుత్‌కు సంబంధించినది.
లోకల్ బాడి ఎన్నికలను సాధ్యమైనంత తొందరగా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో కుల గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కారణంగా గుండెపోటు, స్ట్రోక్, మరణాల ప్రమాదం మూడేళ్లపాటు పెరుగుతుందని అమెరికాలోని కొత్త పరిశోధన వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకోని వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
కేంద్ర పరిపాలన ట్రెబ్యూనల్ ను పలువరు ఐఏఎస్‌లు ఆశ్రయించారు. క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, సృజన అందులో ఉన్నారు.