పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు రాచకొండ కమిషనర్ అండగా నిలిచారు. ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గోడలను గుర్తు తెలియని దుండగులు కూల్చివేయడంతో రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐ ఎల్ బినగర్ లోని క్యాంపు కార్యాలయంలో మొగులయ్యని కలిసి సమస్య వివరాలు ఆరా తీశారు.
పండగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచింది. దాదాపు 50-70శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.
తెలంగాణ గ్రామీణ రోడ్లకు మహర్దశ రానుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతన రోడ్ల నిర్మాణానికి రూ. 1377.66 కోట్లు మంజూరు చేసింది. 92 నియోజకవర్గాల్లో 641 పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.
ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీపై బహిరంగంగా కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుల పేర్లు మరోసారి వెలుగులోకి వచ్చాయి.
చాలా మంది అమ్మాయిలు తమ అత్తమామలు తమతో కలిసి జీవించాలని కోరుకుంటారు. కానీ అడ్జస్ట్ మెంట్ వల్లనో, ఇతర కారణాల వల్లనో గొడవల వల్ల ఇంట్లో వాతావరణం చెడిపోతుంది.
తిరువోణం బంపర్ లాటరీ 2024లో కర్ణాటకకు చెందిన ఓ మెకానిక్ రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. కేరళేతర నివాసి ఈ పెద్ద లాటరీని గెలుచుకోవడం ఇది వరుసగా రెండో సంవత్సరం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాజీ పోలీస్ కానిస్టేబుల్ బుక్యా సాగర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తాజాగా నేడు చికిత్స పొందుతూ ఆయన మరణించారు. జిల్లాలోని బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో బుక్యా సాగర్ విధులు నిర్వర్తించారు.
ఛత్తీస్గఢ్.. ఎన్కౌంటర్ పోరాటంలో 14 మంది మావోలు మృతి చెందారని.. కాల్పుల్లో గాయపడ్డ మిగతా 17 మందిని భద్రతా బలగాలు పట్టుకుని కాల్చి చంపాయని మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది.
వరంగల్ జిల్లాలో మరోసారి కాంగ్రెస్లో వర్గ విభేదాలు బయటకు వచ్చాయి. కొండ వర్గానికి రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గానికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కొండా వర్గం రేవూరి వర్గం మధ్య ఫ్లెక్సీల వివాదం చెలరేగింది.