అలోవెరా చర్మ సంరక్షణకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మం చికాకును తగ్గించడం, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. అలోవెరా జెల్ ముఖంపై అప్లై చేయడం ద్వారా తాజాదనం, గ్లో పెరుగుతుంది. అయితే పచ్చి కలబంద జెల్ అందరికీ పడదు. ఈ జెల్‌ని డైరెక్ట్‌గా అప్లై చేయడం వల్ల కొందరికి సమస్యలు పెరుగుతాయి. నేరుగా ముఖంపై అప్లై చేయడం వల్ల దుష్ప్రభావాలు ఏర్పడవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం…
అలర్జిక్ రియాక్షన్: కలబందలో ఉండే లాటెక్స్ కొంతమందికి చర్మంపై అలెర్జీకి కారణమవుతుంది. అలోవెరా జెల్‌ను అలాగే అప్లై చేయడం వల్ల ముఖంపై దురద, ఎరుపు లేదా వాపు వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు మీ చర్మంపై కనిపిస్తే.. వెంటనే ఉపయోగించడం మానేయండి.
స్కిన్ ఇరిటేషన్: పచ్చి కలబందలో కొన్ని సహజ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి సున్నితమైన చర్మంపై చికాకును కలిగిస్తాయి. దీన్ని నేరుగా అప్లై చేయడం వల్ల చర్మంపై కొద్దిగా మంట లేదా కుట్టిన అనుభూతిని కలిగిస్తుంది.
చర్మం బాగా పొడిబారడం : అలోవెరా జెల్‌ను అప్లై చేయడం వల్ల బలమైన సూర్యకాంతిలో చర్మంపై చికాకు లేదా ఎరుపును కలుగుతుంది. వడదెబ్బకు గురయ్యే అవకాశం పెరుగుతుంది. కొందరికి అలోవెరా జెల్‌ని పదే పదే చర్మంపై అప్లై చేయడం వల్ల తేమ పోతుంది.జెల్‌ను ముఖానికి ఎక్కువసేపు ఉంచితే మాత్రం చర్మం బాగా పొడిబారుతుంది. దీనివల్ల చర్మం మండుతున్న అనుభూతి కలుగుతుంది. అందుకే డైరెక్ట్ గా మొక్క నుంచి తీసిన కలబంద జెల్ ను వాడటానికి బదులుగా పలుచగా ఉన్న మార్కెట్ లో దొరికే కలబంద జెల్ ను వాడటం మంచిది. లేదా దాంట్లో అందుచేత వీలైతే కలబందకు రోజ్ వాటర్, టొమాటో రసం లేదా శెనగపిండి కలిపి అప్లై చేయండి.