డిసెంబర్ 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా వెల్లడైంది. ఈ జాబితాలో మరోసారి మారుతీ సుజుకీ కార్ల ఆధిపత్యం కనిపించింది. మారుతీ సుజుకీకి చెందిన బ్రెజ్జా డిసెంబర్ 2024లో 17,336 యూనిట్లు అమ్ముడైంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది! స్విఫ్ట్, ఎర్టిగా, వ్యాగన్‌ఆర్ వంటి కార్లను వెనక్కి నెట్టేసింది. అయితే.. డిసెంబర్ లో విక్రయించిన టాప్ 5 మోడల్‌లు 15వేల మార్కును దాటాయి. వీటిలో తేడా చాలా తక్కువగా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టాప్ 4 కార్లు మారుతికి చెందినవే ఉన్నాయి. రెండో స్థానంలో వ్యాగన్‌ఆర్, మూడో స్థానంలో స్విఫ్ట్, నాలుగో స్థానంలో ఎర్టిగా నిలిచాయి.
READ MORE: K.A. Paul: కేటీఆర్పై పెట్టిన కేసు దేశంలోనే చెత్త కేసు.. ఒక్క పైసా అవినీతి కూడా జరగలేదు
ఇదిలా ఉండగా.. దేశీయ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయాలని చూస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో వాహన ఎగుమతుల్ని చేసిన కంపెనీ.. రానున్న రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచాలని భావిస్తోంది. అందులో భాగంగానే సరికొత్త మోడళ్లను ఆవిష్కరించనునుంది. 2030నాటికి విదేశీ ఎగుమతులను 8లక్షల యూనిట్లకు చేర్చడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
READ MORE: Rum in Cake : హైదరాబాద్‌లో ఇక్కడ కేక్ తింటున్నారా.. జాగ్రత్త..!
‘‘దాదాపు మూడేళ్ల క్రితం సంవత్సరానికి చేసే వాహన ఎగుమతులు 1 లక్ష యూనిట్ల నుంచి 1.2లక్షల యూనిట్లుగా ఉండేవి. తర్వాత వాటి సంఖ్య క్రమంగా పెరిగింది. 2022-23లో 2.59 లక్షల యూనిట్లుగా ఉన్న ఎగుమతులు 2023-24నాటికి 2.83 లక్షల యూనిట్లకు చేరాయి. ఇదే సమయంలో ఇతర కార్ల ఎగుమతులు 3శాతం తగ్గితే మారుతీ మాత్రం 9.3శాతం వృద్ధి చెందింది’’ అని మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతి గతంలో పేర్కొన్నారు. భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసిన కార్లలో 42శాతం కార్లు మారుతీ సుజుకీవే అని అన్నారు. వచ్చే రెండేళ్లలో వాహన ఎగుమతులు 3 లక్షల యూనిట్లకు పెరగనున్నాయని.. 2030 నాటికి ఆ సంఖ్య 8లక్షల యూనిట్లకు చేరనుందన్నారు.