డిసెంబర్ నెలలో మహీంద్రా వాహనాలకు విపరీతమైన డిమాండ్ కనిపించింది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. డిసెంబర్ 2024 నెలలో 69768 వాహనాలు అమ్ముడయ్యాయి. ఎగుమతులతో కలిపి 16% పెరుగుదల నమోదు చేసింది. మహీంద్రా దేశీయ మార్కెట్‌లో 41424 ఎస్‌యూవీ వాహనాలను విక్రయించింది. ఇందులో 18% వృద్ధిని సాధించింది. 19502 వాహనాలకు విదేశాలకు ఎగుమతి చేసింది.
“డిసెంబర్‌లో 18% వృద్ధితో 41424 ఎస్‌యూవీలను విక్రయించాం. అన్ని వేరియంట్లు కలిపి 69768 వాహనాలు అమ్ముడయ్యాయి. డిసెంబర్‌లో 16% వృద్ధి సాధించాం. ఆటో సెక్టార్‌లో డౌ జోన్స్ సస్టైనబిలిటీ ఇండెక్స్ (DJSI) వరల్డ్ లీడర్ హోదాను సాధించిన ఏకైక భారతీయ ఆటో కంపెనీగా అవతరించాం. 2024 సంవత్సరం చాలా మేలు చేసింది.” అని ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా వెల్లడించారు.
READ MORE: KTR: కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు మళ్ళీ వస్తాయి..
ఇదిలా ఉండగా… సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, మహీంద్రా & మహీంద్రా 78వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు తన కొత్త 5 డోర్ థార్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 3 నుంచి బుకింగ్స్ ప్రారంభం కాగా.. దసరా నుంచి డెలివరీలు మొదలయ్యాయి. బుకింగ్స్‌లో కొత్త రికార్డు సృష్టించింది థార్ రాక్స్. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులోని 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 బీహెచ్‌పీ శక్తిని, 330ఎన్‌ఎమ్ టార్క్‌ని అందిస్తుంది. ఇక 2.2 లీటర్ల mHawk డీజిల్ ఇంజిన్ 150 బీహెచ్‌పీ శక్తిని, 330ఎమ్‌ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు సిక్స్ స్పీడ్ మాన్యువల్, ఆటో మెటిక్ గేర్ బాక్స్‌తో వస్తున్నాయి.
READ MORE: HMPV Virus: చైనాలో కరోనా లాంటి పరిస్థితులు.. సాధారణ ఇన్ఫెక్షన్స్ అంటున్న డ్రాగన్..
సిక్స్ డబుల్ స్టాక్డ్ స్లాట్స్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్‌లు ఉన్నాయి. వెనకభాగంలో సీ- షేప్డ్ ఎల్‌ఈడీ టెయిల్‌లైట్స్, టెయిల్‌గేట్- మౌంటెడ్ స్పేర్ వీల్ అమర్చారు. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టంతో వస్తోంది. ఇది యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేస్తుంది. మహీంద్రా థార్ రాక్స్‌లో.. పవర్డ్ సీట్లు, రెండు సన్‌రూఫ్ ఆప్షన్లు, కనెక్టెడ్ కార్ టెక్, లెవెల్-2 ADAS, అకౌస్టిక్ గ్లాసెస్, 9-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా ఉన్నాయి. అత్యంత భద్రతా పరమైన ఫీచర్లతో మహీంద్రా థార్ రాక్స్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. 35 స్టాండెడ్ సేఫ్టీ ఫీచర్లతో దీన్ని లాంచ్ చేసినట్లు పేర్కొంది. థార్ రాక్స్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సదుపాయం ఉంది. లేన్ కీప్ అసిస్టెంట్, అడాప్టివ్ క్రూజ్ వంటి అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్‌తో మహీంద్రా ఈ థార్‌ను తీసుకొచ్చింది.