-
Chevireddy Bhaskar Reddy: మద్యానికి నేను దూరం.. నన్ను లిక్కర్ కేసులో ఇరికించాలని చూస్తున్నారు..
పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని.. ప్రజలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మాజీ ప్రభుత్వ విప్, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది కిందట ఎన్నికల సమయంలో ఒక వ్యక్తి ద్వారా ఎనిమిది కోట్లు పట్టుకున్నట్టు తెలిసిందని.. తనిఖీల్లో 8 కోట్ల రూపాయలు దొరికితే, దానికి అన్ని ఆధారాలు సమర్పించారన్నారు. -
Kakani Govardhan Reddy: పోలీసు కస్టడీకి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..!
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసు కస్టడీకి అప్పగించారు. మూడు రోజులు పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.. 6వ తేదీ ఉదయం నుంచి 8వ తేదీ సాయంత్రం వరకు కస్టడీకి తీసుకోవాలని స్పష్టం చేశారు. కాకాణి తరఫు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని జడ్జి సూచించారు. -
Nellore: నెల్లూరులో కరోనా కలకలం.. నలుగురికి…
నెల్లూరులో కరోనా కలకలం సృష్టిస్తోంది. నలుగురికి కరోనా లక్షణాలు ఉన్నట్లు జీజీహెచ్ సిబ్బంది గుర్తించారు. అనుమానితుల నమూనాలను వ్యాధి నిర్ధారణ కోసం ల్యాబ్ కి పంపినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో చుట్టుపక్కల జనాలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.. రోజరోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4 వేల 866 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం. గత 24 గంటల్లో ఒక వెయ్యి 238 కొత్త కేసులు నమోదైనట్లు వెల్లడించింది ఆరోగ్య శాఖ. ఇదిలా ఉండగా ఏపీలో కూడా… -
YSRCP: ఈ నెలాఖరు లోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు.. ఎజెండా ఇదే..!
వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్య నేతలతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెలాఖరు లోగా ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు పాలన ఏడాది వైఫల్యాలు, వైఎస్ జగన్ తీసుకొచ్చిన వివిధ కార్యక్రమాలను నిర్వీర్యం చేసిన విధానంపై వివిధ రంగాల ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.. కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వెన్నుపోటు దినం నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి… -
RCB Stampede: తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీ యాజమాన్యంపై కేసు నమోదు..
ఆర్సీబీ విజయోత్సవాల వేళ బెంగళూరులో సంభవించిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. ఈ ఘటనపై సుమోటో కేసు నమోదు చేయాలని బెంగళూరు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తొక్కిసలాట ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నిందితులుగా చేర్చారు. మరోవైపు మెజిస్టేరియల్ విచారణలో భాగంగా ఇప్పటికే వారికి అధికారులు నోటీసులను జారీ చేశారు. -
Ambati Rambabu : నాపై తప్పుడు కేసు నమోదు చేశారు.. ఆ సీఐని వదిలి పెట్టను..!
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మోసపూరితంగా ఉందని.. అందుకే వెన్నుపోటు దినం నిర్వహించామని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి జనం నుంచి అద్బుతమైన స్పందన లభించిందన్నారు. -
RCB Stampede: తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం.. ఎంతంటే?
18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్పు నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాల వేళ పెనువిషాదం చోటుచేసుకుంది. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంతో సహా పలువురు ఇప్పటికే ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్సీబీ యాజమాన్యం సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. అంతే కాకుండా.. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం పరిహారం ప్రకటించింది. మృతి చెందిన 11… -
High Court: తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నాలుగు ప్రశ్నలు..!
తొక్కిసలాట ఘటనపై సుమోటో కేసు నమోదు చేయాలని బెంగళూరు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. మంగళవారం స్టేటస్ రిపోర్టును పరిశీలన చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తొక్కిస్లాట ఘటనపై బెంగళూరు హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఘటనపై ప్రభుత్వానికి సంబంధించి వివరాలను అడ్వొకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. రెండున్నర లక్షల మంది స్టేడియం వద్ద చేరుకున్నారని.. తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందారని.. 56 మంది గాయాలు, 15 మంది డిశ్చార్జ్ అయ్యారని కోర్టుకు తెలిపారు. -
Ram Mohan Naidu: మీరు ఇలాగే చేస్తే.. రానున్న రోజుల్లో ఒకే సీటుకు పరిమితం అవుతారు..
వెన్నుపోటు దినోత్సవం కేవలం పనిలేక చేసినట్టు ఉందని.. కూటమి ప్రభుత్వం లో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేసిందన్నారు. ఏడాది కాలంలో పెన్షన్, అన్నక్యాటీన్, ఉచిత గ్యాస్ సిలిండర్, యువతకి డీఎస్సీ వంటి కార్యక్రమాలు చేసిందన్నారు. కేంద్రప్రభుత్వం సహకారంతో అమరావతి, పోలవరం, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి అసలు జరగవు అనుకున్న కార్యక్రమాలు చేసి చూపించామని తెలిపారు. ప్రతిపక్షానికి ఆనాడే ప్రజలు వెన్ను విరిచారని.. అందుకే 11… -
Harish Rao: 250 కోట్ల మొక్కలు నాటి, రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్‌ది..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలైన హరిత హారం కార్యక్రమం రాష్ట్రంలో హరిత విప్లవాన్ని సృష్టించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో గ్రీన్ కవర్ 24% నుంచి 31%కి పెరిగిందని.. అంటే 7.7% వృద్ధిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మొత్తం 250 కోట్ల మొక్కలు నాటి, రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ దని కొనియాడారు. తాము మేం కేవలం ఆకుపచ్చని తెలంగాణ గురించి మాట్లాడలేదని.. కలను సాకారం చేశామన్నారు.
తాజావార్తలు
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!