అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ వెళ్లి కబీర్ సింగ్ సినిమాతో బిగ్ హిట్ కొట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమా తీశాడు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ కావడం అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రి, బాబీ డియోల్, పృథ్వీ రాజ్ బబ్లూ వంటి వారు కూడా సినిమాలో భాగం కావడంతో సినిమా స్పాన్ పెరిందనే చెప్పాలి! తెలుగులో కూడా పెద్ద ఎత్తున ప్రమోషనల్ కంటెంట్ దించడంతో తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా మీద ఆసక్తి చూపారు.
READ MORE: Ramesh Bidhuri: “నేను గెలిస్తే ప్రియాంకా గాంధీ చెంపల వంటి రోడ్లు”.. బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు..
తాజాగా ఈ సినిమాలో నటించిన నటి త్రిప్తి డిమ్రి కీలక వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రస్తావించింది. మొదట్లో అవకాశాలు లేక కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపింది. దీంతో పాటు యానిమల్ సినిమాకు అంగీకరించడానికి గల కాణాన్ని తెలిపింది. “యానిమల్‌ను మహిళలు ద్వేషించే సినిమాగా ఎప్పుడూ అనుకోలేదు. సినిమాలకు అలాంటి ట్యాగ్స్ నేను ఇవ్వను. ‘కోలా’, ‘బుల్బుల్’ సినిమాలు స్త్రీవాద చిత్రాలుగా భావించలేదు. దర్శకులపై నమ్మకం ఉంచి ఎంచుకుంటాం. కథల్లోని పాత్రకు కనెక్ట్ అవుతాం. యానిమల్ సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు డైరెక్టర్ సందీప్‌ను కలిశాను. ఈ కథ గురించి పూర్తిగా చెప్పాలేదు. జోయా పాత్ర గురించి మాత్రమే వెల్లడించారు.” అని త్రిప్తి డిమ్రి పేర్కొంది.
READ MORE: Arvind Kejriwal: నితిన్ గడ్కరీని ప్రశంసించిన అరవింద్ కేజ్రీవాల్
“యానిమల్ సినిమా చేయకంటే ముందు నేను పాజిటివ్ రోల్స్ పాత్రలు మాత్రమే పోషించాను. ఈ సినిమాలో మాత్రం నా పాత్ర భిన్నంగా ఉంది. మనసులో మోసం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ.. దయ, సానుభూతి కనిపించాలని దర్శకుడు చెప్పారు. దాన్ని నేను సవాలుగా తీసుకున్నాను. వెంటనే సినిమాకు అంగీకరించాను. ’’ అని త్రిప్తి డిమ్రి వెల్లడించింది.