సెకండ్ వరల్డ్ వార్.. ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చే పేర్లు.. హిట్లర్, నాజి జర్మనీ. 1939 నుంచి 1945 వరకు జరిగిన ఈ యుద్ధంలో దాదాలు 8 కోట్లమంది చనిపోయారు. అందులో సైనికులు మాత్రమే కాదు సివిలియన్స్ కూడా చనిపోయారు. 1939లో నాజీ జర్మనీ.. పోలాండ్ పై చేసిన ఇన్వెషన్ వల్ల వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయ్యింది అని మనందరికీ తెలుసు. మరి ఈ యుద్ధం ఎలా ఆగింది. నాజీ జర్మనీతో పాటు ఉన్న దేశాలేవి.. అసలు యుద్ధానికి 2 ఏళ్ల పాటు దూరంగా ఉన్న అమెరికా ఎందుకు ఈ వార్ లో పార్టిసిపేట్ చేసింది. హిరోషిమా, నాగసాకిలపై ఆటమ్ బాంబు వేయడానికి కారణమేంటి..? ఈ రోజు తెలుసుకుందాం..
43 సెకండ్లు అంతా నిశ్శబ్దం…
1945 నవంబర్ 6న.. . ఉదయం 8:15 నిమిషాలకు జపాన్ ఎయిర్ స్పేస్ లో అమెరికాకు చెందిన బోయింగ్ B29 విమానం వెళుతోంది. ఉదయం అవ్వడంతో చిన్న పిల్లలు స్కూల్ లకు, పెద్దవాళ్ళు తమ తమ పనులకు వెళ్లే సమయం. ఆకాశంలో విమానాన్ని చూసి అందరూ ఒకసారి తలపైకి ఎత్తారు. ఆ విమానం లో నుంచి ఎదో వస్తువును కిందకు వదిలేసాడు పైలట్. అందరూ అదేంటి అని అలానే చూస్తూ ఉండిపోయారు. 43 సెకండ్లు అంతా నిశ్శబ్దం. 43 సెకండ్స్ తర్వాత ఆ వస్తువు భూమిపై పడింది. పడీపడగానే.. ముందుగా ఒక పెద్ద లైటింగ్ వచ్చింది. ఆ తర్వాత కొద్దీ క్షణాలుకు పెద్ద శబ్దం వచ్చింది. అదేంటి లైట్ అండ్ సౌండ్ రెండు ఒకేసారి రావాలిగా అనుకుంటున్నారా.. లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ ధ్యాన్ సౌండ్. బేసిక్ ఫిజిక్స్. అంత పెద్ద లైట్ ను వాళ్ళ జీవితంలో ఎప్పుడూ చూసి ఉండరు. అయితే చాలా మందికి అదే ఆఖరి చూపు. ఆ ఊరి పేరు హిరోషిమా, కింద పడిన వస్తువు లిటిల్ బాయ్ అనే ఆటమ్ బాంబ్.
హిరోషిమా, నాగసాకిలపై అమెరికా ఆటోమ బాంబు..
ఈ కథ మనం చిన్నప్పటి నుంచి చాలా సార్లు విని ఉంటాం. హిరోషిమా, నాగసాకిలపై అమెరికా ఆటోమ బాంబు వేసింది అని.. కానీ అమెరికా లిటిల్ బాయ్ అండ్ ఫ్యాట్ మ్యాన్ అనే ఆ రెండు ఆటమ్ బాంబ్స్ వేయడానికి కారణమేంటి. ఆసియ అండ్ యూరోప్ గొడవలో తలదూర్చికూడదు అనుకున్న అమెరికా.. యుద్ధంలో ఎందుకు పాల్గొంది. వరల్డ్ వార్ 2 కి కారణమైన హిట్లర్ చనిపోయిన తర్వాత కూడా అమెరికా, జపాన్ ల మధ్య యుద్ధం ఎందుకు కంటిన్యూ అయ్యింది. అన్న విషయాల గురించి ఈ రోజు డిస్కస్ చేద్దాం.
1939 సెప్టెంబర్ 3న యుద్ధం ప్రకటన..
సో వరల్డ్ వార్ 2 గురించి మనకు ఒక క్లారిటీ రావాలంటే.. ముందు అలైడ్ పవర్స్, అండ్ ఆక్సిస్ పవర్స్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. గ్రేట్ బ్రిటన్, సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ దేశాలు అలైడ్ పవర్స్ కిందకు వస్తాయ్. ఇవి మాత్రమే కాకుండా అలైస్ లో ఫ్రాన్స్ అండ్ చైనా కూడా ఉన్నాయి. మరో పక్క ఇటలీ, జపాన్, జర్మనీ దేశాలు ఆక్సిస్ పవర్స్ కిందకి వస్తాయి. అయితే జర్మనీ.. పోలాండ్ ను ఇన్వేడ్ చేసిన తర్వాత 1939 సెప్టెంబర్ 3న యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఫ్రాన్స్ దేశాలు జెర్మనీపై యుద్ధాన్ని ప్రకటించాయి. ఈ ఇన్సిడెంటే హిరోషిమా & నాగసాకిల ఫ్యూచర్ ని డిసైడ్ చేసింది. యుద్ధం మొదట్లో అలయిడ్ పవర్ కి ఆయిదాలు సప్లై చేయడం వరకు మాత్రమే పరిమితమైన అమెరికా.. పర్ల్ హార్బర్ పై జపాన్ చేసిన దాడి దెబ్బకు 1941 లో జపాన్ పై యుద్ధాన్ని ప్రకటించింది. అసలు పర్ల్ హార్బర్ పైన బాంబ్ వేయాల్సిన అవసరం జపాన్ కు ఎందుకొచ్చింది..? నిద్రపోతున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్టు సైలెంట్ గా ఉన్న అమెరికాను యుద్దానికి ఆహ్వానించింది జపాన్.
గ్రేటర్ ఏషియాను బిల్డ్ చేస్తాం అంటూనే మరోపక్క రిసోర్సెస్ ఎక్సప్లోయిట్..
అప్పట్లో ఎలాగైతే బ్రిటన్.. ఇండియాను ఆక్రమించిందో అలాగే జపాన్ కూడా ఏషియలోని కొన్ని దేశాలను ఆక్రమించిదని. ఇండోనేషియా, మయన్మార్, కంబోడియా, వియత్నాం, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ చైనా, నార్త్ కొరియా, సౌత్ కొరియా దేశాలని జపాన్ ఆక్రమించింది. పైకి మాత్రం గ్రేటర్ ఏషియాను బిల్డ్ చేస్తాం అంటూనే మరోపక్క రిసోర్సెస్ ఎక్సప్లోయిట్ చేయడం స్టార్ట్ చేశారు. 1941లో చైనాలోని మంచూరి అనే ప్రదేశాన్ని ఆక్రమించింది జపాన్. దానితో పాటు సౌత్ లో ఫ్రెంచ్ ఇండో చైనా అయిన వియత్నాం, లాఓస్, కంబోడియా ను ఆక్రమించింది. ఈ ఇన్సిడెంట్ తో వరల్డ్ వార్ 2 లో ఎంటర్ అయ్యింది జపాన్. యుద్ధంలో పార్టిసిపేట్ చేయకపోయినా కూడా ఈ యుద్ధాన్ని ఆపడం కోసం ఎదో ఒకటి చేయాలి అనుకుంది అమెరికా. దాని కోసం వాళ్ళు జపాన్ కు చేసే ఆయిల్ ఎక్స్ పోర్ట్స్ ఆపేసారు. ఇలా ఆయిల్ ఎక్సపోర్ట్స్ ఆపేస్తే జపాన్ యుద్ధంలో నుంచి బయటకు వస్తుంది అనుకుంది అమెరికా. కానీ జపాన్ తగ్గలేదు. మలేషియా అండ్ ఇండోనేషియాలలో కూడా ఆయిల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాలను ఆక్రమించాలి అనుకుంది. కానీ అప్పట్లో ఇండోనేషియా నెదర్లాండ్స్ లో భాగమైతే.. మలేసియా బ్రిటిష్ ఆదీనంలో ఉంది. ఈ రెండు దేశాలు అమెరికాకు మంచి ఫ్రెండ్స్. సో, ఈ ప్రాంతాలను ఆక్రమిస్తే అమెరికా యుద్ధానికి వస్తుంది. అందుకే జపాన్ ఫిలిప్పీన్స్ పై కన్నేసింది. కానీ ఇక్కడ అసలు సమస్య ఏంటంటే అప్పట్లో ఫిలిప్పీన్స్ అమెరికా కంట్రోల్ లో ఉండేది. సో, ఫిలిప్పీన్స్ ను టచ్ చేస్తా అమెరికాను యుద్ధాన్ని ఆహ్వానించినట్టే. కానీ ఈ సారి జపాన్ భయపడలేదు. అమెరికాను ఎదుర్కునే శక్తి తమకుందని చూపించడానికి అమెరికా భాగమైన హవాయి లోని పర్ల్ హార్బర్ అనే నావల్ బేస్ పై సర్ప్రైస్ అట్టాక్జ్ చేసింది జపాన్. 1941 డిసెంబర్ 7 న 300 లకు పైగా జపాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ పెర్ల్ హార్బర్ పై బాంబుల వర్షం కురిపించారు. ఈ ఇన్సిడెంట్ లో 2000 పై సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడితో ఆపారా అంటే అదీ లేదు.. దాడి చేసిన కొన్ని గంటలకే ఫిలిప్పీన్స్ ని ఆక్రమించింది జపాన్. అంకేముంది.. అమెరికా జపాన్ పై యుద్ధం ప్రకటించింది.
1941 వరకు చాలా భయంకరమైన యుద్ధం…
జపాన్ పై అమెరికా యుద్ధం ప్రకటించగానే, ఇటలీ అండ్ జర్మనీ అమెరికాపై యుద్ధాన్ని ప్రకటించాయి. 1941 వరకు చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. అయితే 1943 లో ఇటలీ సరెండర్ అయ్యింది. 1945 లో నాజీ హిట్లర్ తన తుపాకీతో షూట్ చేసుకొని చనిపోయాడు. యుద్ధం ఎవరి వల్ల స్టార్ట్ అయ్యిందో వారే ఇప్పుడు లేరు. కానీ జపాన్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు.. అమెరికాతో యుద్ధాన్ని కంటిన్యూ చేసింది. జరిగిన నష్టాన్ని చూసినా కూడా జపానీస్ ఎంపరర్ హిరోహిటో సరెండర్ కి సిద్ధం గా లేడు. బేసిక్ గా అప్పాలో జపాన్ ప్రజలు ఎలా ఉండేవారంటే.. ఎంపరర్ వాళ్లకు దేవుడు. ఆయన ఏం చెబితే అది చేయాలి. ఆయనకు ఎగైనెస్ట్ గా మాట్లాడితే దేశ ద్రోహం. అలాంటి వారిని వెంటపడి చంపేవారు. జాపనీస్ జనాలు ఆ రేంజ్ లో బ్రెయిన్ వాష్ అయి ఉన్నారు. మరో పక్క కామికాజే అనే ఒక ఫైటర్ పైలట్స్ టీం జపాన్ లో ఉండేది. వీళ్ళు ప్రత్యర్థి సైన్యం మీద, వాల్ల వార్ షిప్స్ పైన తమ విమానాలను క్రాష్ చేసేవారు. ఇలా సూసైడ్ బాంబ్స్ గా మారి తమ ఎంపరర్ ఆర్డర్ ఫాలో అయ్యే వారు అంటేనే అర్థమవుతుంది వారికి తం ఎంపరర్ అంటే ఎంత భక్తి అన్న విషయం. యుద్ధం వల్ల జపాన్ లో పూర్తిగా అన్ ఎంప్లాయిమెంట్ వచ్చి ఉంటుంది కాబట్టి.. జపాన్ ప్రజలు తమ ఎంపరర్ పై తిరగబడతారు అనుకుంది అమెరికా. కానీ అలా కూడా జరగలేదు.
ఆపరేషన్ డౌన్ ఫాల్ స్టార్ చేసిన అమెరికా..
ఇలా చేస్తే వర్కౌట్ అవ్వదు అన్న విషయం అర్థం చేసుకున్న అమెరికా. ఆపరేషన్ డౌన్ ఫాల్ స్టార్ట్ చేసింది. జాపనీస్ ఎంపరర్ ను పట్టుకోవడం కోసం అమెరికా తన ఆర్మీని డైరెక్ట్ గా జపాన్ కు పంపించింది. ఈ ఆపరేషన్ డౌన్ ఫాల్ లోనే అమెరికా, జపాన్ మధ్య ఆఖరి యుద్ధం ఇదే. ఈ యుద్ధంలో అమెరికా గెలించింది. కానీ ఇలా చేస్తే తాము సాధించేది ఏమీ లేదు అని అప్పుడే అమెరికాకు అర్థమైంది. ఈ యుద్ధం ఒకినావా అనే ఐలాండ్ లో జరిగింది. అయితే ఒకినావా ప్రజలు తమ ప్రాణాలు పోతున్నా కూడా తగ్గకుండా అమెరికాతో యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో 12000 మంది అమెరికన్ ప్రాణాలు కోల్పోయారు. ఇలాగే జపాన్ తో యుద్ధం చేస్తే ఎన్ని ప్రాణాలు పోతాయి అన్న యాంగిల్ లో ఆలోచించడం స్టార్ట్ చేశారు అమెరికన్స్. అందుకే ఒక కొత్త ప్లాన్ తో వచ్చారు. అదే మ్యాన్హ్యటన్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ నుంచి వచ్చినవే లిటిల్ బాయ్ అండ్ ఫ్యాట్ మ్యాన్. ప్రాజెక్ట్ పూర్తవ్వగానే అన్ కండిషనల్ గా సరెండర్ అవ్వమని లేకపోతే డిస్ట్రక్షన్ చూస్తారని జపాన్ కు వార్నింగ్ ఇస్తుంది అమెరికా. అసలు ఆటం బాంబ్ అనే కాన్సెప్టే తెలియని జపాన్ ఈ వార్నింగ్ ను లైట్ తీసుకుంది. కానీ ఎకనామిక్ గా జపాన్ బాగా దెబ్బతింది అన్న విషయం అర్థం చేసుకున్న ఎంపరర్ సరెండర్ కి సిద్ధమయ్యాడు. కానీ తాను ఆక్యుపై చేసిన ప్రాంతాల్లో పెత్తనం తనదే ఉండాలి అని కండిషన్ పెట్టాడు. అయితే అమెరికా అడిగింది అన్ కండిషనల్ సరెండర్. సో, ఈ ఆఫర్ ను జపాన్ రిజెక్ట్ చేసింది. మనం వీడియో మొదట్లో మాట్లాడినట్టు నవంబర్ 6, 1945 లిటిల్ బాయ్ ను హిరోషిమాపై వేసింది అమెరికా. ఇదే ప్రపంచంలోని మొదటి ఆటం బాంబు. ఈ దాడిలో 1.5 లక్షల మంది చనిపోయారు.
క్షణాల్లోనే స్మశానంగా మారిన హిరోషిమా ..
లిటిల్ బాయ్ పడిన కొద్దీ క్షణాల్లోనే హిరోషిమా పెద్ద స్మశానంగా మారింది. అప్పటివరకు అంత పెద్ద బాంబ్ ప్రపంచంలో ఎవరూ చూడలేదు. అంత పెద్ద బ్లాస్ట్ చూసిన తర్వాత కూడా హిరోహితో సరెండర్ అవ్వడానికి నో చెప్పాడు. హిరోషిమా ఇన్సిడెంట్ కు కరెక్ట్ గా 3 రోజుల తర్వాత నాగసాకిపై మరో బాంబ్ వేసింది అమెరికా. ఈ బాంబ్ పెరి ఫ్యాట్ మ్యాన్. ఇది లిటిల్ బాయ్ కంటే పవర్ ఫుల్ బామ్. ఈ సారి బాంబ్ ను నాగసాకి పై వేసింది అమెరికా. ఈ సంఘటన తర్వాత 1945 ఆగష్టు 15 న జపాన్ ఎంపరర్ హిరోహితో సరెండర్ కి ఒప్పుకున్నాడు. దీనికి కారణం లిటిల్ బాయ్ అండ్ ఫ్యాట్ మ్యాన్ మాత్రమే కాదు. అదే సమయంలో సోవియట్ యూనియన్ కూడా జపాన్ పై యుద్ధం ప్రకటించింది. ఈ దెబ్బకు భయపడిన జపాన్ ఎంపరర్ హిరోహితో సరెండర్ అయ్యాడు. వరల్డ్ వార్ 2 లో హిట్లర్ ఎన్నో తప్పులు చేసాడు. ఆ తప్పులకు ప్రతిఫలం కూడా అనుభవించాడు. అలాగే జపాన్ కూడా చాలా తప్పులు చేసింది. అందులో ముఖ్యమైనది పెరల్ హార్బర్ ఎటాక్. ఆ ఒక్క ఇన్సిడెంట్ లేకుంటే అమెరికా యుద్ధానికి వచ్చేది కాదు. ఆ రెండు ఆటం బాంబ్ లకు పని ఉండేది కాదు. అందుకే చెబుతారు ఏ పనైనా చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.