ఆపిల్ ఇప్పుడు తన ఐఫోన్17 యొక్క బేస్ మోడల్‌పై పని చేయడం ప్రారంభించినట్లు సమాచారం. దీనిని ఆపిల్ కంపెనీ వచ్చే ఏడాది సెప్టెంబర్ 2025 నెలలో ప్రారంభించవచ్చని అంచనాలు ఉన్నాయి. గత నెలలో యాపిల్ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 16 సిరీస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఎంతో ఇష్టంగా తినే మయోనైజ్‌ని బ్యాన్ చేసింది. ఈ మయోనైజ్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు సమీక్ష నిర్వహించారు. అనంతరం దీని వల్ల అనేక అనారోగ్య ప్రయోజనాలున్నాయని గుర్తించారు. దీంతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తాజాగా దీన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.
దీపావళి పండుగను భారతదేశంలో వైభవంగా జరుపుకుంటారు. హిందూ మతంలో దీపావళి పండుగకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గణేశుడిని, లక్ష్మి దేవిని పూజిస్తారు. దీనితో పాటు ప్రజలు తమ ఇళ్లలో దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా దీపావళి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అయితే... దీపావళి పండుగను భారతదేశంలో పలు ప్రాంతాల్లో జరుపుకోరు. అక్కడ పటాకులు కూడా కాల్చరు.
పాము మరణం తర్వాత పగ తీర్చుకుంటాయని సినిమాలు, కథలలో వినే ఉంటారు. అయితే వాస్తవానికి అలాంటి ఉదంతం యూపీలోని బరేలీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పొలంలోకి వచ్చిన పామును ఓ యువకుడు చంపేశాడు. ఆ యువకుడు పామును దారుణంగా చితకబాదాడు.
గత కొన్ని సంవత్సరాలుగా.. దీపావళి, ధన్తేరస్లలో భారతీయ మార్కెట్లలో చైనా ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతోంది. ముఖ్యంగా అలంకరణ వస్తువుల విక్రయాలు గతంతో పోలిస్తే ఈ సారి గణనీయంగా తగ్గాయి. తక్కువ డిమాండ్ కారణంగా.. దిగుమతులు కూడా తగ్గుతున్నాయి. దీని కారణంగా దేశీయ వస్తువుల అమ్మకాలు పెరుగుతున్నాయి. నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచార ప్రభావం ఇప్పుడు దేశంలో కనిపిస్తోంది. దేశీయ వస్తువులనే కొనుగోలు చేయాలన్న ఆయన నినాదం చైనాపై తీవ్ర ప్రభావం చూయించింది.
లడఖ్‌లో వెనక్కి తగ్గిన భారత్- చైనా సైన్యాలు, సరిహద్దుల్లో సాధారణ పెట్రోలింగ్, ఇరు దేశాల మధ్య శాంతి యుగానికి నాందిగా ఈ చర్య, దీపావళి సందర్భంగా పరస్పరం స్వీట్లు పంచుకోనున్న సైనిక వర్గాలు లడఖ్‌లో భారత్, చైనా సైన్యాలు వెనక్కి తగ్గాయి. ఇప్పుడు ఇరు దేశాల సైన్యాలు 2020లో ఘర్షణకు ముందు ఉన్న వారి సంప్రదాయ పోస్టుల వద్ద మోహరించి ఉంటాయి. ఇప్పుడు సరిహద్దుల్లో సాధారణ పెట్రోలింగ్ మాత్రమే ఉంటుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుత జీవన విధానంతో చాలా మంది పైల్స్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి పైల్స్ వస్తే నరకయాతన ఉంటుంది. ఒకే చోట కదలకుండా కూర్చోలేక.. సరిగ్గా నడవలేక.. బాధపడుతుంటారు. పైల్స్‌ను మన భాషలో అర్శమొలలు అంటారు. మలద్వారం లోపలి భాగంలో మొలలు ఏర్పడతాయి.
దీపావళి పండుగ సమయంలో పటాకులు, దీపాల వినియోగిస్తుంటాం. ఈ సమయంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా మంటలు లేదా అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చు. కాబట్టి, ఈ సందర్భంగా జాగ్రత్తల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. అంతే కాదు.. ప్రమాద తీవ్రతను తగ్గించడానికి కాలిన గాయాలకు ప్రథమ చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉండటం కూడా అవసరం.
తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ప్యాసింజర్‌కి రూ.25,000 పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని జిల్లా వినియోగదారుల కమిషన్ దక్షిణ మధ్య రైల్వే (ఎస్సిఆర్)ని ఆదేశించింది. ఈ ప్రయాణికుడు, అతని కుటుంబం తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు సమస్యలను ఎదుర్కొన్నారు.
చాలా మంది దీపావళి సందర్భంగా కొత్త కారు కొనాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు.. దాని లుక్-డిజైన్‌పై మాత్రమే దృష్టి పెడుతుంటారు. ఇవే కాకుండా కారు భద్రతా ఫీచర్లను కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే లాంగ్ డ్రైవ్ సమయంలో ఈ ఫీచర్లు మిమ్మల్ని రక్షిస్తాయి. మీ కారులో ఉండాల్సిన 10 భద్రతా ఫీచర్ల గురించి తెలుసుకుందాం..