యూపీఐ గురించి ఈ రోజుల్లో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. చెల్లింపులకు సంబంధించిన ఈ లావాదేవీ ప్రక్రియను ఈ రోజుల్లో విరివిగా వాడుతున్నారు. ఇది ఒక బ్యాంకు నుంచి మరోక బ్యాంకుకు మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులకు అనుమతినిస్తుంది. మొబైల్ ఫోన్ లోని యాప్ ద్వారా ఈ పేమెంట్స్ చేయవచ్చు. యూపీఐ ద్వారా డబ్బును 24X7 బదిలీ చేసుకునే సదుపాయముంది.
2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ భారతీయ సంతతికి చెందిన సీఈవో సత్య నాదెళ్ల జీతం 63 శాతం పెరిగి దాదాపు 7.91 కోట్ల డాలర్లకు (సుమారు రూ. 665 కోట్లు) చేరింది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ఫైలింగ్ ప్రకారం.. నాదెళ్ల స్టాక్ అవార్డులు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం.. ఆయన $39 మిలియన్ విలువైన స్టాక్ అవార్డును అందుకున్నారు. అది ఇప్పుడు $71 మిలియన్లకు పెరిగింది.
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA)కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఈ కోర్సు చదవడానికి అమెరికాలో అనేక ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. భారతదేశం నుంచి కూడా వేలాది మంది విద్యార్థులు ఎంబీఏ చదవడానికి అమెరికన్ విశ్వవిద్యాలయాలకు వెళతారు. అయితే ఈ యూనివర్శిటీల ఫీజులు చాలా ఎక్కువగా ఉండటం వల్ల భయపడుతుంటారు.
వ్యాపారాన్ని ప్రారంభించడం అంత తేలికైన విషయం కాదు. కానీ ధైర్యం, అభిరుచి ఉంటే ఏదైనా సులభమే అవుతుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ అమ్మాయి దీన్ని నిరూపించింది. ఆమె కోటి రూపాయల ఉద్యోగాన్ని వదిలి స్టార్టప్ ప్రారంభించింది. ఈ రోజు తన కంపెనీ ఆదాయం రూ.40 కోట్లకు పైగా ఉంది. ఆమె విజయవంతమైన వ్యాపారవేత్తగా మారింది.
నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులపై చర్చ జరగనుంది. నవంబర్ 26న, రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా, పార్లమెంటు ఉభయ సభలను పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్లో నిర్వహించవచ్చు. శీతాకాల సమావేశాల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్, వక్ఫ్ బిల్లుపై పెద్ద దుమారమే రేగే అవకాశం ఉంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ నివేదికను కేబినెట్ ఆమోదించిన తర్వాత శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఖలిస్తానీ ఉగ్రవాదులు, ఛాందసవాదుల విషయంలో భారత్‌తో సంబంధాలను చెడగొట్టేందుకు కెనడా ప్రయత్నిస్తోంది. ఈసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉప విదేశాంగ మంత్రి డేవిడ్ మారిసన్ భారత హోం మంత్రి అమిత్ షాపై విరుచుకుపడ్డారు. ఖలిస్తానీ ఉగ్రవాదులను టార్గెట్ చేసేందుకు అమిత్ షా కుట్ర పన్నారని మోరిసన్ ఆరోపించారు.
జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులు దురదృష్టకరమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భద్రతలో ఎలాంటి లోపం లేదని చెప్పారు. ఉగ్రవాదులకు భద్రతా బలగాలు ధీటుగా సమాధానమిస్తున్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే లోయలో దాడులు తగ్గాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు.
రష్యా సైనిక-పారిశ్రామిక స్థావరానికి మద్దతిస్తున్నారనే ఆరోపణలతో 15 భారతీయ కంపెనీలతో సహా 275 మంది వ్యక్తులు, సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. చైనా, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్, టర్కీకి చెందిన కంపెనీలను కూడా రష్యాకు అత్యాధునిక సాంకేతికత, పరికరాలను సరఫరా చేసినందుకు నిషేధించామని యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా తన యుద్ధ యంత్రాంగానికి ఈ కంపెనీలు మద్దతు తెలిపాయని ఆరోపించింది.
ఢిల్లీలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గొడవల కారణంగా ఓ భార్య తన భర్త ప్రైవేట్ పార్ట్ కోసి పారిపోయింది. దీంతో భర్త పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేరానికి పాల్పడడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
అయోధ్య దీపోత్సవం సందర్భంగా గిన్నిస్ బుక్‌లో రెండు రికార్డులు నమోదయ్యాయి. 1121 మంది అర్చకులు కలిసి సరయు మహా హారతి చేశారు. దీంతో 25 లక్షల 12 వేల 585 దీపాలు వెలిగించారు. రాంలాలా సన్నిధిలో జరిగే తొలి దీపోత్సవంలో ఈసారి యోగి ప్రభుత్వం అద్వితీయమైన చొరవ తీసుకుంది.