ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్ష రెండవ రోజున ప్రారంభమవుతుంది. ఈ యాత్ర ఈరోజు అంటే జూన్ 27న ప్రారంభమవుతుంది. ఈ మహా యాత్ర జూలై 8 వరకు కొనసాగుతుంది. 12 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో జగన్నాథుడు, అతని సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర పూరి ఆలయం నుంచి గుండిచా ఆలయానికి వారి వారి రథాలపై ఊరేగుతారు. ఈ మహా యాత్ర సందర్భంగా.. జగన్నాథ ఆలయంలో ‘ఛేరా పహారా’ అనే ప్రత్యేకమైన సంప్రదాయం నిర్వహిస్తారు. ఈ సంప్రదాయంలో భాగంగా యాత్ర ప్రారంభమయ్యే ముందు, ఆ మార్గాన్ని బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. అసలు బంగారు చీపురుతో ఎందుకు శుభ్రం చేస్తారు? అనే సందేహం అందరికీ వచ్చే ఉంటుంది. ఈ సంప్రదాయం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుందాం.
READ MORE: Maargan Review: మార్గన్ రివ్యూ
పూరి జగన్నాథ ఆలయంలో నిర్వహించే ఈ ప్రత్యేకమైన ‘ఛెరా పహారా’ ఆచారం వెనుక బలమైన విశ్వాసం ఉంది. రాజుల వారసులు మాత్రమే ఈ ప్రత్యేక ఆచారంలో పాల్గొంటారు. పౌరాణిక నమ్మకం ప్రకారం.. బంగారాన్ని విలువైన, అత్యంత పవిత్రమైన లోహంగా పరిగణిస్తారు. రథం వెళ్లే మార్గాన్ని శుభ్రం చేయడానికి బంగారంతో చేసిన చీపురును ఉపయోగించడం శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. రథయాత్ర ప్రారంభమయ్యే ముందు, మూడు రథాల మార్గాన్ని బంగారు చీపురుతో శుభ్రం చేసి, వేద మంత్రాలు జపిస్తారు. భగవంతుడిని స్వాగతించడానికి సన్నాహానికి చిహ్నంగా భావిస్తారు. అంటే భగవంతుడిని ఆహ్వానిస్తారన్న మాట. అలాగే.. రథయాత్ర విజయవంతంగా సాగాలని కోరుకునే సంకేతంగా భావిస్తారు.
READ MORE: Asus Chromebook CX14: ఆసుస్ కొత్త ల్యాప్‌టాప్ విడుదల.. స్మార్ట్ ఫోన్ ధరకన్న తక్కువకే!
మతపరమైన ప్రాముఖ్యత..
బంగారు చీపురుతో శుభ్రం చేయడానికి మతపరమైన కారణం ఏమిటంటే.. బంగారాన్ని శుభం, స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. ఆలయ మార్గాన్ని శుభ్రం చేయడానికి దీనిని ఉపయోగించడం దేవుని పట్ల గౌరవం, భక్తికి చిహ్నంగా భావిస్తారు. ఈ ఆచారం భక్తుల భక్తి, అంకితభావాన్ని వ్యక్తపరుస్తుంది. బంగారు చీపురుతో శుభ్రం చేసుకోవడం వల్ల ఆ ప్రాంతంలో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుందని నమ్మిక. బంగారం అదృష్టం, శ్రేయస్సుకు చిహ్నం, కాబట్టి ఇలా చేయడం వల్ల యాత్రలో స్వచ్ఛత, సానుకూలత కొనసాగుతుందని భావిస్తారు. ఇది మతపరంగా మాత్రమే కాకుండా సాంస్కృతిక దృక్కోణం నుండి కూడా చాలా ముఖ్యమైనది.