దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ చేపట్టిన “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్”లో భాగంగా గత సంవత్సరం నుంచి భారత రాష్ట్రపతి కార్యాలయ ఆధ్వర్యంలో ఈ వివిధతకా అమృత్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్లు.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. భారతదేశంలోని సాంస్కృతిక, భాషా, సంప్రదాయ వైవిధ్యాన్ని పురస్కరించుకుంటూ “భిన్నత్వం లో ఏకత్వం” అనే స్ఫూర్తిని చాటి చెప్పటమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ రోజు ప్రారంభమయ్యే ఉత్సవాలలో అన్ని దక్షిణ భారత భారత రాష్ట్రాలు పాల్గొంటున్నాయి. అందరికీ ఉచితంగా ప్రవేశ సదుపాయం కల్పించారు. ఈ నెల 6వ తేదీ నుంచి 9వతేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సైతం పెవిలియన్ ఏర్పాటు చేసింది.
READ MORE: Jio Recharge: డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 5G ప్రయోజనాలతో రూ. 500లోపు బెస్ట్ ప్లాన్స్ మీకోసం
ఈ పెవిలియన్ లో రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్ లతో సహ 20మంది వివిధ ప్రాంతాల ప్రముఖ చేనేత కార్మికులు, 20 మంది హాస్తకళా నిపుణులచే స్టాళ్ళు ఏర్పాటు చేయబడ్డాయి. అంతే కాకుండా ముగ్గురు హస్తకళా నిపుణులు స్వయంగా ఆయా వస్తువుల తయారీ పద్ధతిని అతిథులకు చూపించనున్నారు. అదే విధంగా అతిథులకు నోరురించే విధంగా తెలంగాణ రుచులతో కూడిన ఫుడ్ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అతిథులను అలంరించడానికి రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ కళా రూపాలైన ఒగ్గు డోలు,పేరిణి, గుస్సాడీ ప్రదర్శనలు ఉంటాయి.
READ MORE: Minister Seethakka: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో మంత్రి సీతక్క హాట్ కామెంట్స్..